عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«إِذَا جَاءَ رَمَضَانُ فُتِّحَتْ أَبْوَابُ الْجَنَّةِ، وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ، وَصُفِّدَتِ الشَّيَاطِينُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1079]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1079]
రమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.