عَنْ سَهْلٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ فِي الْجَنَّةِ بَابًا يُقَالُ لَهُ الرَّيَّانُ، يَدْخُلُ مِنْهُ الصَّائِمُونَ يَوْمَ الْقِيَامَةِ، لَا يَدْخُلُ مِنْهُ أَحَدٌ غَيْرُهُمْ، يُقَالُ: أَيْنَ الصَّائِمُونَ، فَيَقُومُونَ لَا يَدْخُلُ مِنْهُ أَحَدٌ غَيْرُهُمْ، فَإِذَا دَخَلُوا أُغْلِقَ، فَلَمْ يَدْخُلْ مِنْهُ أَحَدٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1896]
المزيــد ...
సహ్ల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"స్వర్గంలో అర్-రయ్యన్ అనే ద్వారం ఉంది, మరియు ఉపవాసాలు పాటించేవారు పునరుత్థాన దినమున దాని గుండా ప్రవేశిస్తారు మరియు వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. (ఆ దినమునాడు) 'ఉపవాసాలు పాటించేవారు ఎక్కడ?' అని అనబడుతుంది. వారు లేస్తారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించరు. వారి ప్రవేశం తర్వాత ద్వారం మూసివేయబడుతుంది మరియు ఎవరూ దాని గుండా ప్రవేశించరు."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1896]
ఈ హదీథులో రయ్యన్ ద్వారం అని పిలువబడే ఒక స్వర్గ ద్వారం ఉందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేస్తున్నారు; పునరుత్థాన దినమున ఉపవాసం పాటించేవారు దాని ద్వారా ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ ప్రవేశించరు. ఆ దినమున "ఉపవాసం పాటించేవారు ఎక్కడ?" అని పిలుపు వస్తుంది, వారు నిలబడి ఆ ద్వారం గుండా స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరెవరూ ప్రవేశించరు. వారిలో చివరి వ్యక్తి కూడా ప్రవేశించిన తర్వాత, అది మూసివేయబడుతుంది. ఇక మరెవరూ ప్రవేశించరు.