عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«المُسْلِمُ مَنْ سَلِمَ المُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ، وَالمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللَّهُ عَنْهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 10]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 10]
సహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస్తున్నారు. అతను వారిని అవమానించడు, తిట్టడు లేదా వెన్నుపోటు పొడవడు మరియు తన నాలుకతో వారిని బాధించడు. అలాగే సహచర ముస్లిములు అతని చేతి నుండి కూడా సురక్షితంగా ఉంటారు – అంటే అతడు వారిపై దాడి చేయడు, వారి సంపదలను అన్యాయంగా, అధర్మంగా కబళించడు; లేక ఆవిధమైన ఏ పనీ చేయడు. అలాగే ‘ముహాజిరు’ అంటే అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదలివేసే వాడు.