ఉప కూర్పులు

హదీసుల జాబితా

“విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ధరిస్తూ ఉన్న అంగి (చొక్కా, పైవస్త్రం) కొంతకాలానికి క్షీణించినట్లు, మీలో ఎవరి హృదయాలలోనైనా విశ్వాసమూ క్షీణిస్తుంది. కనుక మీ హృదయాలలో విశ్వాసాన్ని నవీకరించమని అల్లాహ్ ను వేడుకొనండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ