عن أبي هريرة رضي الله عنه ، أن رسول الله صلى الله عليه وسلم قال: «الإيمانُ بِضْعٌ وَسَبْعُونَ أو بِضْعٌ وسِتُونَ شُعْبَةً: فَأَفْضَلُهَا قَوْلُ: لا إله إلا الله، وَأَدْنَاهَا إِمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ، وَالحَيَاءُ شُعْبَةٌ مِنَ الإِيمَانِ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...
అబూహురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం"విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి అందులో"లా ఇలాహ ఇల్లల్లాహు"వాక్యం పలకడం(విశ్వసించడం)అత్యున్నతమైనది అయితే"మార్గం మధ్య నుండి హానికరమైనదాన్ని తొలగించడం'అల్పమైనది,సిగ్గు (బిడియం) కూడా విశ్వాసానికి సంభంధించిన శాఖల్లో ఒకటి.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
విశ్వాసం అనేది ఒక గుణము లేదా ఒక భాగము మాత్రమే కాదు,కానీ దీనికి చాలా విభాగాలు డెబ్బై లేక అరవై శాఖలు ఉన్నాయి.అందులో అత్యంత ప్రధానమైనది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’కలిమా ను ఆచరించడం మరియు అల్పమైనది “ మార్గములో వెళ్ళు వారిని భాదించే వస్తువును తొలగించడం,అనగా మార్గములో ఉన్న రాళ్ళు,ముళ్ళు ,మరియు ఇలాంటి ఇతర వస్తువులు,నమ్రత,బిడియం కలిగి ఉండటం కూడా ఈమాన్ శాఖలో ఒకటి.