عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:
«ذَاقَ طَعْمَ الْإِيمَانِ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ رَسُولًا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 34]
المزيــد ...
అల్ అబ్బాస్ ఇబ్న్ అల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) తాను రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నాను అని ఉల్లేఖిస్తున్నారు:
“అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 34]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక విశ్వాసి తన విశ్వాసములో నిజాయితీగా ఉండి, మరియు ఆ విశ్వాసముతో అతని హృదయం శాంతిని పొందుతుందో, అతడు మూడు విషయాలతో సంతృప్తి చెందినట్లైతే, అటువంటి విశ్వాసి తన హృదయంలో విశాలతను కనుగొంటాడు, అందులో ఆనందాన్ని గ్రహిస్తాడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు చేరువగా ఉండే ప్రీతిని, ఆనందాన్ని పొందుతాడు.
మొదటిది: అల్లాహ్’యే తన ప్రభువు అని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, అతని ప్రభువు నుండి అతని భాగంగా అతనికి చేరే ఉపాధి, మరియు అతనిపై వచ్చిపడే పరిస్థితులు అన్నింటి పట్లా అతని హృదయం సంతృప్తితో విశాలం అవుతుంది. అతను తన హృదయంలో దేనిపైనా ఎటువంటి అభ్యంతరాన్ని కనుగొనడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను వదిలి మరొక ప్రభువు కావాలని కోరడు.
రెండవది: ఇస్లాం తన ధర్మమని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, ఇస్లాంయొక్క విధులు మరియు బాధ్యతలపట్ల అతని హృదయం విశాలం అవుతుంది, మరియు అతడు ఇస్లాంను వదిలి మరొక మార్గాన్ని ఎంచుకొనడు.
మూడవది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అనే విషయంలో సంతృప్తి చెందుట: ఆ విషయంలో సంతృప్తి చెందితే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన సందేశము మరియు బోధించిన ప్రతి విషయంతో అతడు ఎటువంటి సందేహమూ, సంశయమూ లేకుండా అతని హృదయం విశాలం అవుతుంది. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకం చేసిన విషయాన్ని తప్ప మరింక దేనినీ అనుసరించడు.