عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَا لَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا شَيْءَ لَهُ» فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا شَيْءَ لَهُ» ثُمَّ قَالَ: «إِنَّ اللَّهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ»
[صحيح] - [رواه النسائي] - [سنن النسائي: 3140]
المزيــد ...
అబూ ఉమామహ్ అల్ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రతిఫలం మరియు కీర్తి కోసం యుద్ధానికి వెళ్ళే వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఏమి పొందుతాడు?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతని కొరకు ఏమీ లేదు” అన్నారు. అతడు అదే ప్రశ్నను మూడు సార్లు అడిగాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లూ “అతని కొరకు ఏమీ లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”.
[దృఢమైనది] - [దాన్ని నసాయీ ఉల్లేఖించారు] - [سنن النسائي - 3140]
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, అల్లాహ్ నుండి ప్రతిఫలం మరియు ప్రజల నుండి ప్రశంసలు మరియు కీర్తి కోరుతూ పోరాడటానికి (జిహాద్’కు) బయలుదేరిన వ్యక్తిపై షరియత్ పరమైన తీర్పును గురించి అడగడానికి వచ్చాడు. అతడు ప్రతిఫలం పొందుతాడా అని? దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: "అతనికి ఎలాంటి ప్రతిఫలం లభించదు. ఎందుకంటే, అతడు (జిహాద్’లో పాల్గొనాలనే) తన సంకల్పములో అల్లాహ్’కు ఇతరులను భాగస్వాములుగా చేసినాడు”. ఆ వ్యక్తి తన ప్రశ్నను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మూడు సార్లు పునరావృతం చేశాడు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మూడుసార్లు సమాధానమిచ్చారు మరియు మూడుసార్లూ అదే సమాధానం ధృవీకరించారు - అతనికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత ఆచరణలు అంగీకరించబడే నియమాన్ని గురించి అతనికి తెలియజేశారు: అల్లాహ్ కార్యాలను అంగీకరించడు, అవన్నీ కేవలం అల్లాహ్ కొరకు, మరియు ఇతరులను పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన ఆయనకు (అల్లాహ్’కు) భాగస్వాములను చేయకుండా ఆచరిస్తే తప్ప.