عن عُثْمَانَ بْنَ أَبِي الْعَاصِ رضي الله عنه:
أنه أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: يَا رَسُولَ اللهِ، إِنَّ الشَّيْطَانَ قَدْ حَالَ بَيْنِي وَبَيْنَ صَلَاتِي وَقِرَاءَتِي يَلْبِسُهَا عَلَيَّ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «ذَاكَ شَيْطَانٌ يُقَالُ لَهُ خِنْزَِبٌ، فَإِذَا أَحْسَسْتَهُ فَتَعَوَّذْ بِاللهِ مِنْهُ، وَاتْفُلْ عَلَى يَسَارِكَ ثَلَاثًا»، قَالَ: فَفَعَلْتُ ذَلِكَ فَأَذْهَبَهُ اللهُ عَنِّي.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2203]
المزيــد ...
ఉస్మాన్ ఇబ్న్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇలా అన్నారని ఉల్లేఖిస్తున్నారు:
“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నిశ్చయంగా షైతాన్ నాకూ, నా సలాహ్’కు (నమాజుకు), మరియు (నమాజులో) నా ఖుర్’ఆన్ పఠనానికి మధ్య వస్తున్నాడు, నా ఏకాగ్రతను భంగపరుస్తున్నాడు.” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు మూడు సార్లు (ప్రతీకాత్మకంగా) ఉమ్మివేయి.” నేను అలాగే చేసాను. అల్లాహ్ వాడిని నా నుండి దూరం చేసినాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2203]
ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! నాకు నా సలాహ్’కు (నమాజుకు) మధ్య షైతాన్ వచ్చి నన్ను నమాజులో మనసు సంపూర్ణంగా లగ్నం చేయకుండా చేస్తున్నాడు, నా ఖుర్’ఆన్ పఠనంలో నన్ను గందరగోళానికి గురి చేస్తున్నాడు; అందులో (నేను సరిగానే పఠిస్తున్నానా అనే) సందేహాన్ని కలుగజేస్తున్నాడు” అన్నారు. అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడు “ఖిన్’జబ్” అని పిలువబడే షైతాను. ఒకవేళ నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, అల్లాహ్ (యొక్క స్మరణ) నే గట్టిగా పట్టుకుని ఉండు, మరియు ఆయన శరణు వేడుకో. మరియు నీ ఎడమ చేయి వైపునకు మూడు సార్లు కొద్దికొద్దిగా ఉమ్మి వేయి.” ఉథ్మాన్ ఇలా అన్నారు “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన విధంగానే నేను చేసాను. అల్లాహ్ వాడిని (షైతానును) నా నుండి దూరం చేసినాడు.