عن حُذَيْفَةَ رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ بَيْنَ السَّجْدَتَيْنِ: «رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي».
[صحيح] - [رواه أبو داود والنسائي وابن ماجه وأحمد] - [سنن ابن ماجه: 897]
المزيــد ...
హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను మన్నించు, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు)
[దృఢమైనది] - - [سنن ابن ماجه - 897]
ఈ హదీసు ద్వారా, నమాజులో రెండు సజ్దాల నడుమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “రబ్బిగ్’ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” అని పలికేవారని తెలుస్తున్నది.
“రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను క్షమించు) అంటే దాని అర్థము, దాసుడు తన ప్రభువును తన పాపాలను తుడిచి వేయమని, తన తప్పులను కప్పి ఉంచమని అర్థిస్తున్నాడు అని.