+ -

عَنْ ‌وَرَّادٍ كَاتِبِ الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ قَالَ: أَمْلَى عَلَيَّ الْمُغِيرَةُ بْنُ شُعْبَةَ فِي كِتَابٍ إِلَى مُعَاوِيَةَ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ: «لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 844]
المزيــد ...

అల్-ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు యొక్క లేఖకుడు వర్రాద్ ఉల్లేఖనం :
“ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “ప్రతి ఫర్జ్ సలాహ్ (నమాజు) తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు” (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, విశ్వ సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్తోత్రములూ ఆయనకు చెందినవే, ఆయన సర్వసమస్తము పై ఆధిపత్యము, అధికారము కలవాడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించదలిచిన దానిని ఎవరూ ఆపలేరు, నీవు ఆపివేసిన దానిని ఎవరూ ప్రసాదించలేరు. ఐశ్వర్యవంతునికి అతనిసంపద, నీకు వ్యతిరేకంగా దేనికీ పనికిరాదు.)

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 844]

వివరణ

ఈ హదీసు ద్వారా – ప్రతిఫర్జ్ నమాజు తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికే వారని తెలుస్తున్నది: ““లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు”
అంటే దాని అర్థము – అల్లాహ్ యొక్క ఏకత్వమును తెలిపే పదాలైన “లా ఇలాహ, ఇల్లల్లాహ్” ను నేను ధృవపరుస్తున్నాను, నిజమైన ఆరాధనను నేను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేక పరుస్తాను, (అల్లాహ్ గాక) వేరే ఇంకెవరికీ ప్రత్యేకించడానికి నిరాకరిస్తాను, అల్లాహ్ తప్ప ఆరాధనలకు నిజఆరాధ్యుడు ఎవరూ లేరు అని నేను ధృవపరుస్తున్నాను ఈ విశ్వ సామ్రాజ్యము యొక్క సంపూర్ణ సార్వభౌమాధికారం కేవలం ఆయనదే, ఆకాశాలు మరియు భూమి యందు నివసించే జనుల స్తోత్రములన్నిటికీ కేవలం ఆయన మాత్రమే హక్కు గలవాడు, ఎందుకంటే ఆయన ప్రతి విషయముపై ఆధిపత్యము, అధికారము గలవాడు. అల్లాహ్ (ఎవరికైనా) ఏమైనా ప్రసాదించదలచినా, లేక ఆపివేయ దలచినా ఎవరూ దానిని రద్దు చేయలేరు, (ఎవరికైనా) సంపదలు ఏవీ ఉపయోగపడజాలవు, అతని సత్కార్యములు తప్ప.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ టర్కిష్ బోస్నియన్ సింహళ హిందీ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية ఇటాలియన్ Урумӣ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నమాజు ముగిసిన తరువాత ఈ జిక్ర్ స్మరణ వాక్యాలు పలకడం అభిలషణీయమైన ఆచరణ. ఎందుకంటే ఇందులో తౌహీద్ గురించి పదాలు మరియు అల్లాహ్ ను స్తుతించే పదాలు ఉన్నాయి.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం నడుచుకోవడానికి మరియు దానిని వ్యాప్తి చెందించడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉండాలి
ఇంకా