عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْعُو وَيَقُولُ: «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ القَبْرِ، وَمِنْ عَذَابِ النَّارِ، وَمِنْ فِتْنَةِ المَحْيَا وَالمَمَاتِ، وَمِنْ فِتْنَةِ المَسِيحِ الدَّجَّالِ».
وفِي لَفْظٍ لِمُسْلِمٍ: «إِذَا فَرَغَ أَحَدُكُمْ مِنَ التَّشَهُّدِ الْآخِرِ، فَلْيَتَعَوَّذْ بِاللهِ مِنْ أَرْبَعٍ: مِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ الْمَسِيحِ الدَّجَّالِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1377]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి).
సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1377]
నమాజులో చివరి (రకాతులో) తషహ్హుద్ పూర్తి అయిన తరువాత, సలాముతో నమాజు ముగించుటకు ముందు నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ దుఆ చేసేవారు; మరియు మనలను కూడా ఆ నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరమని ఆదేశించినారు.
మొదటిది: సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్)
రెండవది: నరకాగ్ని శిక్ష నుండి (మిన్ అజాబిన్నార్). అది పునరుత్థానన దినమున జరుగుతుంది.
మూడవది: ఈ జీవితపు సంక్షోభాలు, పరీక్షలనుండి – అంటే నిషేధిత వాంఛల నుండి, నిషేధిత విషయాల ఆకర్షణల నుండి రక్షణ, అలాగే తప్పుదారి పట్టించే సందేహాలనుండి రక్షణ; మరియు మరణము యొక్క పరీక్షల నుండి – అంటే, మరణ ఘడియ ఆసన్నమైనపుడు కలిగే మరణ వేదన నుండి రక్షణ, అలాగే ఇస్లాం నుండి మరియు సున్నత్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళే విషయాలనుండి రక్షణ, మరియు సమాధిలో దైవదూతల ప్రశ్నల నుండి రక్షణ.
నాలుగవది: ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవం నుండి రక్షణ. మసీహిద్దజ్జాల్ ఉపద్రవం ఈ ప్రపంచపు అంతిమ ఘడియలలో సంభవిస్తుంది. ఈ ఉపద్రవం ద్వారా అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవాన్ని మిగతా వాటితో కలిపి కాకుండా ప్రత్యేకంగా పెర్కొన్నారు – కారణం ఈ ఉపద్రవం తీసుకువచ్చే మార్గభ్రష్ఠత్వం, అరాచకం చాలా పెద్దద్ది కావడమే.