+ -

عَنِ ابْنَ مَسْعُودٍ رضي الله عنه قَالَ:
عَلَّمَنِي رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَفِّي بَيْنَ كَفَّيْهِ، التَّشَهُّدَ، كَمَا يُعَلِّمُنِي السُّورَةَ مِنَ القُرْآنِ: «التَّحِيَّاتُ لِلَّهِ، وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ». وفي لفظ لهما: «إِنَّ اللهَ هُوَ السَّلَامُ، فَإِذَا قَعَدَ أَحَدُكُمْ فِي الصَّلَاةِ فَلْيَقُلْ: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، فَإِذَا قَالَهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، ثُمَّ يَتَخَيَّرُ مِنَ الْمَسْأَلَةِ مَا شَاءَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6265]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6265]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కు “తషహ్హుద్” పఠించడాన్ని నేర్పించినారు. అది నమాజులో పఠించబడుతుంది. ఇబ్న్ మస్’ఊద్ యొక్క ధ్యాస అంతా తన వైపు ఉండేలా, ఆయన చేతిని తన రెండు చేతుల మధ్య తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు కు తషహ్హుద్ పఠించడాన్ని నేర్పించినారు. తషహ్హుద్’ను బోధించడం పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శ్రధ్ధ – వారు తషహ్హుద్ లోని ప్రతి పదమూ మరియు దాని అర్థాన్ని అదే విధంగా ఉద్దేశ్యించినారని ఏ విధంగానైతే వారు బోధించినారో – అనే విషయం అర్థమవుతున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అత్తహియ్యాతు లిల్లాహి” “అన్ని రకాల శుభ వచనాలు, శుభాకాంక్షలు, మరియు శుభాభివందనాలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకే.” “అత్తహియ్యాతు” అంటే పూజ్య భావాన్ని, గౌరవాన్ని, ఆరాధనను సూచించే అన్ని రకాల వచనాలు, పదాలు మరియు ఆచరణలు అని అర్థం. అవన్నీ కూడా కేవలం సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కు మాత్రమే అర్హమైనవి. “అస్సలవాతు” అంటే ఒక ముస్లిం ప్రతి దినము ఆచరించే నమాజులు అని అర్థము “సలాహ్” లేక “నమాజు” పేరిట సుపరిచితమైన ఆచరణ ఇది. ఇందులో విధిగా ఆచరించవలసిన నమాజులు (ఫర్జ్ నమాజులు), మరియు స్వచ్ఛందంగా ఆచరించవలసిన నమాజులు (నఫీలు నమాజులు) ఉన్నాయి. “అత్తయ్యిబాతు” – అంటే మంచి విషయాలన్నీ. అంటే – అన్ని మంచి మాటలు, మంచి పనులు, పరిపూర్ణతను సూచించే అన్ని మంచి గుణగణాలు. ఇవన్నీ కూడా కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అర్హమైనవి. “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అంటే “ఓ ప్రవక్తా! నీపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, మరియు ఆయన కరుణ ఉండుగాక” అని అర్థము. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అల్లాహ్’ను ప్రార్థించుట, ఆయనకు దుఆ చేయుట – ప్రతి దుఃఖము నుండి మరియు ప్రతి ఆపద మరియు హాని నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్షేమం కొరకు, అదే విధంగా అన్ని రకాల శుభాలలో ఆయనకు వృద్ధి కలగాలని, ప్రతి శుభము ఆయనకు సమృద్ధిగా లభించాలని దుఆ చేయుట. “అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్” “మాపై మరియు నీతిమంతులైన అల్లాహ్ దాసులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక” ఇది భూమ్యాకాశాలలో ఉన్న ధర్మపరాయణుడూ, నీతిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రతి దాసుని కొరకు చేయు దుఆ. “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్” అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను.” ఆ సాక్ష్యపు వాక్యాన్ని పలకడం అంటే – అది ఒక రకమైన ఒప్పుకోలు, స్వీకృతి – అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను మరియు దానిని స్వీకరిస్తున్నాను” అని. “వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” “మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అలాగే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు అనే విషయాన్ని మరియు ఆయన తెచ్చిన సందేశము అంతిమ సందేశము అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను మరియు స్వీకరిస్తున్నాను.
నమాజులో ఈ విధంగా తషహ్హుద్ పలికిన తరువాత – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "నమాజు ఆచరిస్తున్న వాడు అతనికి నచ్చిన, లేక అతనికి ఇష్టమైన ఏ దుఆనైనా చేసుకోవచ్చు" అన్నారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నమాజులో తషహ్హుద్ యొక్క స్థానము – నమాజులో చివరి సజ్దాహ్ ఆచరించిన తరువాత, మరియు మూడు రకాతుల, నాలుగు రకాతుల నమాజులలో రెండవ రకాతు తరువాత.
  2. తషహ్హుద్ లో శుభకరమైన పదాలు (అత్తహియ్యాత్) పలుకుట విధి. (తషహ్హుద్’కు సంబంధించిన) సహీహ్ హదీథులలో ఉల్లేఖించబడిన ‘తహియ్యాత్’ పదాలలొ వేటినైనా ఉచ్ఛరించవచ్చును అనడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆధారాలు ఉన్నాయి.
  3. పాపపు పని లేక తప్పుడు పనికి చెందిన దుఆ చేయుట నిషేధము (హరాం). అలా కాక నమాజు ఆచరిస్తున్న వ్యక్తి, నమాజులో తనకు ఇష్టమైన ఏ దుఆనైనా చేయవచ్చును.
  4. (పైకి వినబడేలా కాకుండా) దుఆ మనసులో చేయుట అభిలషణీయము.
ఇంకా