+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رضي الله عنهما قال: قال رَسولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيهِ خَلَّةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَلَّةٌ مِنْ نِفَاقٍ حَتَّى يَدَعَهَا: إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا خَاصَمَ فَجَرَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 58]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 58]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు లక్షణాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు, ఒక ముస్లింలో ఈ నాలుగు లక్షణాలు కలిసి ఉంటే, ఈ లక్షణాల కారణంగా అతను కపటులను బలంగా పోలి ఉంటాడు. ప్రగాఢంగా ఈ లక్షణాలను కలిగి ఉన్నవారికి ఇది వర్తిస్తుంది, కానీ అరుదుగా ఉన్నవారు ఈ వర్గంలో చేర్చబడరు. అవి:
మొదటిది: అతను మాట్లాడేటప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతాడు మరియు అతడు తన మాటలలో సత్యవంతముగా ఎప్పుడూ ఉండడు.
రెండవది: అతను ఒడంబడిక చేస్తే, అతను దానిని నెరవేర్చడు, మరియు అతని సహచరుడికి ద్రోహం చేస్తాడు.
మూడవది: అతను వాగ్దానం చేస్తే, అతను దానిని నెరవేర్చడు మరియు దానిని ఉల్లంఘిస్తాడు.
నాల్గవది: అతను ఎవరితోనైనా వాదనకు దిగి, గొడవపడితే, అతని వాదన తీవ్రంగా ఉంటుంది, అతను సత్యం నుండి వైదొలగుతాడు, మరియు అతను దానిని తిరస్కరించడానికి మరియు దానిని చెల్లనిదిగా చేయడానికి కుతంత్రాలను పన్నుతాడు, మరియు అతను అబద్ధాలు చెబుతాడు.
కపటత్వము అంటే, అది లోన ఉన్న దానికి వ్యతిరేకంగా బయటకు చూపడం. ఈ అర్థం ఈ లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిలో కనుగొనవచ్చు. అతని కపటత్వం అతనితో మాట్లాడే, అతడు వాగ్దానం చేసే, అతను వాదనకు దిగే మరియు అతడు ప్రజలలో ఏదైనా ఒడంబడిక చేసుకునే వారి పట్ల కనిపిస్తుంది. కపటవాది అంటే ఇస్లాంలో అని మాత్రమే కాదు. అతడు తన అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకుంటూ తన కపటత్వాన్ని చూపుతాడు. ఎవరైతే ఈ లక్షణాలలో ఒకదానిని కలిగి ఉంటారో, అతను దానిని విడిచిపెట్టే వరకు అతను కపటత్వం యొక్క ఒక లక్షణాన్ని కలిగి ఉంటాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ సింహళ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية Малагашӣ
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. కపటత్వాన్ని గురించి భయపెట్టడానికి మరియు వాటిలో పడకుండా హెచ్చరించడానికి కపటుని యొక్క కొన్ని సంకేతాలను ఈ హదీథు వివరిస్తుంది.
  2. ఈ హదీథు యొక్క లక్ష్యాలు: ఇందులో వివరించబడిన లక్షణాలు కపటత్వము యొక్క లక్షణాలు; ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి, ఈ లక్షణాలలో కపటుడిని పోలి ఉంటాడు, అతను అవిశ్వాసాన్ని దాచిపెట్టి ఇస్లాంను చూపించే కపటుడు అని కాదు, వారి గుణగణాలను, వారి నైతికతను కలిగి ఉంటాడు. దీనిని గురించి ఇలా చెప్పబడింది: ఈ లక్షణాలు గాఢంగా కలిగి ఉండి, వాటి పట్ల అజాగ్రత్తగా ఉండి, వాటి విషయాన్ని తేలికగా తీసుకునే వ్యక్తికి ఇది ఆపాదించబడుతుంది. అటువంటి వ్యక్తి సాధారణంగా లోపభూయిష్టమైన విశ్వాన్ని కలిగి ఉంటాడు (నిఖార్సైన విశ్వాసాన్ని కలిగి ఉండడు).
  3. ఇమాం అల్ ఘజాలీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ధార్మికత యొక్క మూలము మూడు విషయాలపై ఉంటుంది. వాక్కు, ఆచరణ మరియు సంకల్పము. కనుక ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబద్ధం ద్వారా వాక్కులో చోటు చేసుకునే చెడును, ద్రోహం చేయడం ద్వారా ఆచరణలో చోటు చేకునునే చెడును మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించడం ద్వారా ఉద్దేశ్యము, సంకల్పములలో చోటు చేసుకునే చెడును ఎత్తి చూపారు. ఎందుకంటే వాగ్దానాన్ని ఉల్లంఘించడం అనేది, వాగ్దానన్ని రద్దు చేయదు, వాగ్దానం చేయునపుడే దానిని నెరవేర్చే సంకల్పము లేకపోయినట్లైతే. అయితే వాగ్దానాన్ని నెరవేర్చే దృఢసంకల్పము కలిగి ఉన్నప్పటికీ, తరువాత ఏదో జరిగి, పరిస్థితుల కారణంగానో, లేక చేసిన వాగ్దానం కంటే మంచి వికల్పము తోచిన కారణంగానో దానిని నెరవేర్చలేకపోతే అతనిపై ‘కపటత్వము’ యొక్క ఆరోపణ కానీ, దోషము కానీ ఉండవు.
  4. కపటత్వం రెండు రకాలుగా ఉంటుంది: ధార్మికపరమైన కపటత్వము; ఇది తనను కలిగి ఉన్న వానిని ధర్మము (ఇస్లాం) నుండి బయటకు తీస్తుంది. ధార్మికపరమైన కపటత్వము అంటే బయటకు ఇస్లాంను కలిగి ఉన్నట్లు చూపుతూ, అవిశ్వాన్ని లోన దాచి పెట్టడం. ఇక రెండవది ఆచరణ పరమైన కపటత్వము; అంటే ఇది కపటులను వారి తీరుతెన్నులలో అనుకరించడం. ఇది తనను కలిగి ఉన్న వానిని ధర్మము (ఇస్లాం) నుండి బయటకు తీయదు. కానీ ఈ కపటత్వన్ని కలిగి ఉండడం ‘ఘోరమైన పాపము’ లలో (కబాయిర్ లలో) ఒకటిగా పరిగణించబడుతుంది.
  5. హాఫీజ్ ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైతే తన హృదయములో విశ్వాసము కలిగి ఉండి, మరియు అతడు తన నాలుకతో కూడా విశ్వాసవంతుడు అయినట్లైతే (మాటలలో కూడా విశ్వాసవంతుడే అయినట్లైతే), అతడు అవిశ్వాసి అని తీర్పు చేయబడదు, లేక అతడు శాశ్వతంగా నరకాగ్నిలో పడి ఉండే కపటుడుగా పరిగణించబడడు.
  6. ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఉలెమాల ఒక సమూహం ఇలా అన్నారు: ఈ హదీథులో పేర్కొనబడిన కపటులు అంటే అర్థము – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్న కపటులు. వారు తాము విశ్వాసము స్వీకరించినాము అని విశ్వాసులము అని తమ విశ్వాసమును గురించి మాట్లాడినారు, కానీ వారు అబద్ధమాడినారు; ధర్మములో వారికి విధులు, బాధ్యతలు ఇవ్వబడినాయి, కానీ వారు ధర్మాన్ని మోసం చేసినారు; ధర్మానికి సంబంధించిన విషయాలలో మరియు ధర్మానికి సహాయపడతామని వారు ప్రమాణం చేసినారు, కానీ వారు ప్రమాణ భంగం చేసినారు; విభేదాలలో, గొడవలు, తగవులలో వారు అత్యంత అనైతికంగా ప్రవర్తించినారు.
ఇంకా