عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ نَبِيٍّ بَعَثَهُ اللهُ فِي أُمَّةٍ قَبْلِي إِلَّا كَانَ لَهُ مِنْ أُمَّتِهِ حَوَارِيُّونَ، وَأَصْحَابٌ يَأْخُذُونَ بِسُنَّتِهِ وَيَقْتَدُونَ بِأَمْرِهِ، ثُمَّ إِنَّهَا تَخْلُفُ مِنْ بَعْدِهِمْ خُلُوفٌ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ، وَيَفْعَلُونَ مَا لَا يُؤْمَرُونَ، فَمَنْ جَاهَدَهُمْ بِيَدِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِلِسَانِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِقَلْبِهِ فَهُوَ مُؤْمِنٌ، وَلَيْسَ وَرَاءَ ذَلِكَ مِنَ الْإِيمَانِ حَبَّةُ خَرْدَلٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 50]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు. వారు తమ తరువాత వచ్చిన వారితో తొలగించబడ్డారు. మరియు వారు (తరువాత వచ్చినవారు) చేయని పనులను గురించి మాట్లాడతారు మరియు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. ఎవరైతే వారితో తన చేతితో పోరాడుతాడో అతడు విశ్వాసి. ఎవరైతే వారితో తన నాలుకతో పోరాడుతాడో అతడు విశ్వాసి, మరియు ఎవరైతే వారితో తన హృదయంతో పోరాడుతాడొ అతడు విశ్వాసి. ఇక దీనికి మించి ఆవ గింజంత విశ్వాసం కూడా లేదు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 50]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన జాతివారి నుండి ఎంపిక చేయబడిన శిష్యులు, సహాయకులు, సహచరులు, నిజాయితీ గల ముజాహిదీన్లు కలిగి లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఏ జాతికీ అల్లాహ్ ప్రవక్తను పంపలేదు. అటువంటి శిష్యులు వారి తరువాత వారి ప్రతినిధులుగా (ఖలీఫాలుగా) కాగలిగిన అన్ని అర్హతలూ కలిగి ఉండేవారు. వారు ఆ ప్రవక్త యొక్క సున్నత్’ను అనుసరిస్తారు మరియు ఆయన ఆదేశాలను శిరసావహిస్తారు. ఆ సలఫ్ సాలిహీన్’ల (ధార్మీకులైన పూర్వీకుల) తరువాత మంచివారు కాని వ్యక్తులు వచ్చారు. వారు తాము చేయని పనులను గురించి చెబుతారు మరియు వారు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. కాబట్టి వారితో తన చేతితో పోరాడేవాడు విశ్వాసి, తన నాలుకతో వారితో పోరాడేవాడు విశ్వాసి, మరియు తన హృదయంతో వారితో పోరాడేవాడు విశ్వాసి. అంతకు మించిన విశ్వాసం లేదు, కనీసం ఆవగింజంత కూడా లేదు.