عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
كُنْتُ أَغْتَسِلُ أَنَا وَالنَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ كِلاَنَا جُنُبٌ، وَكَانَ يَأْمُرُنِي، فَأَتَّزِرُ، فَيُبَاشِرُنِي وَأَنَا حَائِضٌ، وَكَانَ يُخْرِجُ رَأْسَهُ إِلَيَّ وَهُوَ مُعْتَكِفٌ فَأَغْسِلُهُ وَأَنَا حَائِضٌ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 299]
المزيــد ...
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము; అలాగే నేను ఋతుస్రావము (బహిష్ఠు) స్థితిలో ఉన్నపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అంగవస్త్రము (షాల్ వంటిది) ధరించమని చెప్పి, నన్ను కౌగలించుకుని ముద్దులాడేవారు; అలాగే వారు మస్జిదులో ఏతికాఫ్ లో గడుపునపుడు – నేను బహిష్ఠు స్థితిలో ఉన్న సమయాన కూడా, వారు తన తలను (కిటికీ నుండి) ఇంటిలోనికి పెట్టేవారు , నేను వారి తలను కడిగేదానిని.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 299]
ఈ హదీసులో ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియ జేస్తున్నారు. వాటిలో ఒకటి: జనాబత్ స్థితిలో వారితో కలిసి స్నానం చేసిన విషయాన్ని – ఒకే నీటితొట్టిలో నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము అని తెలియజేసారు. అలాగే ఆమె బహిష్ఠు స్థితిలో ఉండగా, ఒకవేళ వారు ఆమెకు చేరువ కావాలని తలిస్తే, నడుము నుండి మోకాలి క్రింది వరకు ఆమెను ఒక అంగవస్త్రాన్ని ధరించమని చెప్పి, సంభోగములో పాల్గొనకుండా, ఆమెను కోరికతో కౌగలించుకుని ముద్దులాడేవారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో ఏతికాఫ్ లో గడిపే రోజులలొ, ఆయిషా రజియల్లాహు అన్హా) బహిష్ఠు స్థితిలో ఇంటిలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను ఇంటిలోనికి పెట్టేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా వారి తలను కడిగేవారు.