عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضيَ اللهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا صَلَّى الفَجْرَ جَلَسَ فِي مُصَلَّاهُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ حَسَنًا، وَقَالَ: كَانَ لَا يَقُومُ مِنْ مُصَلَّاهُ الَّذِي يُصَلِّي فِيهِ الصُّبْحَ أَوِ الغَدَاةَ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ، فَإِذَا طَلَعَتِ الشَّمْسُ قَامَ، وَكَانُوا يَتَحَدَّثُونَ فَيَأْخُذُونَ فِي أَمْرِ الجَاهِلِيَّةِ، فَيَضْحَكُونَ وَيَتَبَسَّمُ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 670]
المزيــد ...

జాబిర్ బిన్ సమురహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ ముగించిన తరువాత, సూర్యుడు బాగా ఉదయించే వరకు ఆయన నమాజు చేసిన చోటనే కూర్చునేవారు, ఆయన ఫజ్ర్ (ఉదయం) నమాజు చేసిన చోట నుండి సూర్యుడు ఉదయించే వరకు లేచేవారు కాదు. సూర్యుడు ఉదయించిన తర్వాతనే లేచేవారు. సహాబాలు (జాహిలియ్యా) అజ్నా కాలం నాటి విషయాలను మాట్లాడుకుంటూ, నవ్వుకునేవారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చిరునవ్వు నవ్వేవారు.

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 670]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ (సంప్రదాయం) ఏమిటంటే, వారు ఫజ్ర్ నమాజ్ చేసిన తర్వాత, సూర్యుడు ఉదయించి పైకి వచ్చే వరకు తాను ఫజ్ర్ నమాజ్ చేసిన స్థలంలోనే కూర్చునేవారు. వారు ఫజ్ర్ నమాజ్ చేసిన ఆ స్థలం నుండి సూర్యుడు ఉదయించే వరకు లేచేవారు కాదు. సూర్యుడు ఉదయించిన తరువాత ఆయన అక్కడి నుండి లేచేవారు, మరియు ఆయన మౌనంగా ఉండగా, సహాబాలు తాము ఇస్లాం స్వీకరించడానికి పూర్వం జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ, ఆనాటి తమ అజ్ఞానానికి నవ్వుకునేవారు మరియు ఒక్కోసారి ఆయన కూడా వారితో పాటు చిరునవ్వు నవ్వేవారు.

من فوائد الحديث

  1. ఉదయం పూట చేసే ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం అయ్యే వరకు జిక్ర్ (అల్లాహ్ ధ్యానం) చేయుట మరియు ఎలాంటి ఆటంకం లేనంత వరకు నమాజు చేసిన ప్రదేశంలోనే కూర్చొని ఉండుట అభిలషణీయము.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ సత్ప్రవర్తన మరియు మృదు స్వభావం గురించి వివరించబడినది, ఆయన తన సహాబాలతో కూర్చుని, వారి మాటలను మరియు కథలను విని చిరునవ్వు నవ్వేవారు.
  3. మస్జిదులో హదీథు మరియు జాహిలియ్యా (ఇస్లాంకు పూర్వపు) రోజుల గురించి ప్రస్తావించుటకు అనుమతి ఉంది.
  4. నవ్వు మరియు చిరునవ్వుకు అనుమతి ఉంది; ఎందుకంటే అది నిషేధించబడిన బిగ్గరగా, అధికంగా నవ్వడంలోనికి రాదు.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (28)
ఇంకా