عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَمْنَعُوا إِمَاءَ اللَّهِ مَسَاجِدَ اللَّهِ، وَلَكِنْ لِيَخْرُجْنَ وَهُنَّ تَفِلَاتٌ».

[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 565]
المزيــد ...

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«అల్లాహ్ దాసీలను అల్లాహ్ మస్జిదుల నుండి నిరోధించకండి, కానీ వారు సువాసనలు పూసుకోకుండా రావాలి»

[హసన్ హదీథు] - [అబూదావూద్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 565]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ యొక్క సంరక్షకుడిని మరియు ఆమె బాధ్యత వహించే వారిని, స్త్రీలను మస్జిదులకు వెళ్ళకుండా నిరోధించడాన్ని నిషేధించారు మరియు స్త్రీలు బయటకు వెళ్ళేటప్పుడు, వారు పురుషుల ఆకర్షణకు మరియు పాపానికి పాల్బడే కారణంగా మారకుండా ఉండేందుకు, సువాసనలు పూసుకోకుండా మరియు అలంకరణలు చేసుకోకుండా వెళ్ళాలని ఆదేశించారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఫిత్నా అంటే ఇతరులను ప్రలోభంలో పడవేసే ప్రమాదం లేకుండా ఉంటే, మహిళ అలంకరణలు చేసుకోకుండా, సువాసనలు పూసుకోకుండా మస్జిదులో నమాజు ఆచరించడానికి అనుమతి ఉంది.
  2. భర్తలకు అనుమతి ఇవ్వమనే ఆదేశం నిర్దేశించబడినందున, స్త్రీ తన భర్త అనుమతి లేకుండా అతని ఇంటి నుండి బయటకు వెళ్ళరాదని దీని ద్వారా నిరూపించబడింది.
  3. ఇస్లాం స్త్రీల పట్ల శ్రద్ధ వహిస్తుంది. మరియు ఆమెకు మేలు చేకూర్చే జ్ఞాన సముపార్జన మరియు అలాంటి వాటి కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళడం వంటి విషయాల నుండి ఆమెను నిరోధించకూడదని తాకీదు చేస్తున్నది.
  4. స్త్రీపై పురుషుని సంరక్షణ మరియు ఆమె పట్ల అతని శ్రద్ధ యొక్క నిరూపణ స్పష్టమవుతున్నది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإندونيسية ఇంకా (28)
ఇంకా