عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمْ المَسْجِدَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ وَلْيَقُلْ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ وَلْيَقُلْ: اللَّهُمَّ اعْصِمْنِي مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ»، وَلِلْحَاكِمِ: «وَإِذَا خَرَجَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَلْيَقُلْ: اللَّهُمَّ أَجِرْنِي مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ».

[حسن] - [رواه ابن ماجه والحاكم] - [سنن ابن ماجه: 773]
المزيــد ...

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే, అతడు ప్రవక్తపై సలాం పంపి ఇలా పలకాలి: “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము), అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ప్రవక్తపై సలాం పంపి ఇలా పలకాలి: “అల్లాహుమ్మ అ’సిమ్నీ మినష్ షైతానిర్రజీమ్” (ఓ అల్లాహ్! బహిష్కరింపబడిన షైతాన్ నుండి నన్ను రక్షించు)», మరియు హాకిం ఉల్లేఖన ప్రకారం: «అలాగే బయటకు వెళ్ళునపుడు అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సలాం పంపి ఇలా పలకాలి: “అల్లాహుమ్మ అజిర్నీ మినష్ షైతానిర్రజీమ్” (ఓ అల్లాహ్! బహిష్కరింపబడిన షైతాన్ నుండి నాకు శరణు ప్రసాదించు)».

[హసన్ హదీథు] - [ఇబ్న్ మాజహ్ మరియు హాకిమ్ నమోదు చేసినారు:] - [సునన్ ఇబ్న్ మాజహ్ - 773]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం మస్జిదులోనికి ప్రవేశించాలనుకున్నప్పుడు, అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ విధంగా సలాం పంపాలని మార్గదర్శకం చేశారు: అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా ముహమ్మద్, ఆ తర్వాత ఇలా పలకాలి: (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక). మరియు బయటకు వెళ్ళినప్పుడు ప్రవక్తపై సలాం పలకాలి మరియు ఇలా చెప్పాలి: (అల్లాహుమ్మ ఇ’సిమ్నీ మినష్షైతానిర్రజీమ్), మరియు హాకిమ్ ఉల్లేఖన ప్రకారం: ఇలా చెప్పాలి: (అల్లాహుమ్మ అజిర్నీ మినష్షైతానిర్రజీమ్).

من فوائد الحديث

  1. ఈ హదీథులో తెలుపబడిన దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు పలుకుట అభులషణీయము (ముస్తహబ్).
  2. అల్లాహ్ ను స్మరించుట అన్ని మస్జిదులలోనూ చేయవచ్చును, మస్జిద్-ఎ-హరాంలో కూడా.
  3. ప్రవేశించునపుడు కరుణ కొరకు మరియు బయటకు వచ్చునపుడు షైతాను నుండి రక్షణ కొరకు వేడుకొనుట ఈ దుఆల యొక్క ప్రత్యేకత: ప్రవేశించు వ్యక్తి తనను అల్లాహ్ మరియు ఆయన స్వర్గానికి చేరువ చేసే ఆరాధనలలో నిమగ్నమై ఉంటాడు. కనుక (అల్లాహ్ యొక్క) కరుణను స్మరించుట సరియైనదే. అలాగే అతడు బయటకు వచ్చినప్పుడు, అతడు పరధ్యానాలు మరియు వ్యాపకాలతో నిండిన ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. కనుక షైతాను నుండి భద్రత మరియు సంరక్షణ కొరకు అల్లాహ్ ను వేడుకొనుట ఆ సందర్భములో సరియైనదే.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఇంకా (28)
ఇంకా