عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ صَلَّى صَلاَتَنَا وَاسْتَقْبَلَ قِبْلَتَنَا وَأَكَلَ ذَبِيحَتَنَا فَذَلِكَ المُسْلِمُ الَّذِي لَهُ ذِمَّةُ اللَّهِ وَذِمَّةُ رَسُولِهِ، فَلاَ تُخْفِرُوا اللَّهَ فِي ذِمَّتِهِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 391]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి».
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 391]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినది ఏమిటంటే, ఎవరైతే ఇస్లాం ధర్మం యొక్క బహిరంగ ఆచారాలకు కట్టుబడి, మనలా నమాజు చేస్తాడో, మన ఖిబ్లా అయిన కఅబహ్ వైపునకు అభిముఖుడవుతాడో మరియు మనం జిబహ్ చేసిన దానిని ధర్మసమ్మతమైనదిగా భావించి తింటాడో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క రక్షణ మరియు వాగ్దానం ఉంది. కాబట్టి అతని విషయంలో అల్లాహ్ యొక్క రక్షణ మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించకండి.