ఉప కూర్పులు

హదీసుల జాబితా

.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని దానిని కంఠస్థం చేసుకునేందుకు వ్రాసి ఉంచుకునే వాడిని. దానికి ఖురైషీయులు ఇలా అంటూ నన్ను వారించేవారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్నీ రాస్తున్నావా? ఆయన మానవమాత్రుడు, ఆయన కోపంలోనూ మాట్లాడుతారు, అలాగే సంతోషంలోనూ మాట్లాడుతారు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. (జరిగిన విషయాన్ని) తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రస్తావించినాను. అపుడు వారు తన చేతి వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “@రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ