عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: إِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِذَا شَرِبَ الْكَلْبُ فِي إِنَاءِ أَحَدِكُمْ فَلْيَغْسِلْهُ سَبْعًا».
ولمسلم: « أولاهُنَّ بالتُراب».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 172]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా పలికినారు:
“ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 172]
ఒకవేళ ఏదైనా పాత్రలో కుక్క నాలుక పెడితే (ఆ పాత్రను నాకినా, లేక ఆ పాత్ర నుండి తిన్నా) ఆ పాత్రను ఏడు సార్లు కడగాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు. అందులో మొదటిసారి మట్టితో తోమాలని తరువాత ఆరుసార్లు నీటితో కడగాలని ఆదేశించినారు. తద్వారా ఆ పాత్ర దాని అశుద్ధత నుండి మరియు దాని హాని నుండి పూర్తిగా పరిశుభ్రమవుతుంది.