عَنْ زَيْنَبَ بِنْتِ جَحْشٍ رَضِيَ اللَّهُ عَنْها أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ عَلَيْهَا فَزِعًا يَقُولُ:
«لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَيْلٌ لِلْعَرَبِ مِنْ شَرٍّ قَدِ اقْتَرَبَ، فُتِحَ اليَوْمَ مِنْ رَدْمِ يَأْجُوجَ وَمَأْجُوجَ مِثْلُ هَذِهِ» وَحَلَّقَ بِإِصْبَعِهِ الإِبْهَامِ وَالَّتِي تَلِيهَا، قَالَتْ زَيْنَبُ بِنْتُ جَحْشٍ فَقُلْتُ يَا رَسُولَ اللَّهِ: أَنَهْلِكُ وَفِينَا الصَّالِحُونَ؟ قَالَ: «نَعَمْ إِذَا كَثُرَ الخَبَثُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3346]
المزيــد ...
జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులైన స్థితిలో నా వద్దకు వచ్చి, ఇలా అన్నారు:
“లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు”. జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “అపుడు నేను “ఓ రసూలుల్లాహ్! మనలో దైవభక్తి గల వ్యక్తులు ఉండగా కూడా మనం నశించిపోతామా?" అన్నాను. ఆయన ఇలా అన్నారు: "అవును, దుష్టత్వం ప్రబలినప్పుడు."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3346]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అంటూ భీతిల్లిన స్థితిలో, భయకంపితులై, జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా వద్దకు వచ్చారు. భయకంపితులై ఉన్న స్థితిలో “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అనడం ‘ఏదో చెడు జరుగబోతుంది’, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను ఆశ్రయించడం, మరియు ఆయనను మొరపెట్టుకోవడం తప్ప దాని నుండి తప్పించుకునే అవకాశం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వచ్చి పడబోయే అరిష్టమునుండి ఈ అరబ్బులకు వినాశం గాను, ఈ రోజు య’జూజ్ మరియు మ’జూజ్ ల అడ్డుగోడలో ఇంత రంధ్రం చేయబడింది, అది దుల్’ఖర్నైన్ నిర్మించిన అడ్డుగోడ..” అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి బొటనవ్రేలును, దానికి ప్రక్కనే ఉన్న చూపుడు వ్రేలును కలిపి గుండ్రంగా, వృత్తాకారంగా చేసి చూపించారు. జైనబ్ రదియల్లాహు అన్హా “మన మధ్య సజ్జనులు, ధర్మపరాయణులు ఉండగా అల్లాహ్ వినాశనం వచ్చి పడేలా ఎలా చేస్తాడు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆమెతో ఇలా అన్నారు: "అశ్లీలత, దుర్మార్గం, పాపాలు, వ్యభిచారం, మద్యపానం మరియు ఇతర విషయాల రూపంలో చెడు పెరుగుతుంటే, వినాశనంపై వచ్చి పడుతుంది.