عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ سَمُرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1648]
المزيــد ...
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1648]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అత్-తవాగీ” పేరిట ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. “తాగియహ్” అనే పదం యొక్క బహువచనం “అత్-తవాగీ”; ఇవి విగ్రహాలు, అల్లాహ్ ను వదిలి (లేదా అల్లాహ్ తో పాటు) బహుదైవారాధకులు వీటిని పూజించేవారు, ఆరాధించేవారు; ఇవి వారి దౌర్జన్యానికి మరియు అవిశ్వాసానికి కారణం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తండ్రుల పేరున ప్రమాణం చేయడాన్ని కూడా నిషేధించినారు. ఇస్లాంకు పూర్వం అరబ్బులు గర్వంతో, గొప్పతో తమ తండ్రులపై ప్రమాణం చేయడం ఆనవాయితీగా ఉండేది.