عَن أُمِّ سَلَمَةَ أُمِّ المُؤْمِنينَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رضي الله عنها قَالت: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ كَانَ لَهُ ذِبْحٌ يَذْبَحُهُ فَإِذَا أُهِلَّ هِلَالُ ذِي الْحِجَّةِ، فَلَا يَأْخُذَنَّ مِنْ شَعْرِهِ، وَلَا مِنْ أَظْفَارِهِ شَيْئًا حَتَّى يُضَحِّيَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1977]
المزيــد ...

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఉమ్ముల్ ముమినీన్ ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు."

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 1977]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ చేయాలని సంకల్పం చేసుకున్న వారికి ఇలా ఆదేశించారు: "ఎవరైతే ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలనుకుంటున్నారో, దుల్-హిజ్జహ్ నెలవంక కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తన తల వెంట్రుకల నుండి, చంకల క్రింద పెరిగే వెంట్రుకల నుండి, మీసం నుండి, శరీరంలోని ఇతర ప్రాంతాలలోని అంటే మర్మాంగాలు మొదలైన చోట పెరిగే వెంట్రుకల నుండి, చేతి/కాళ్ల గోర్ల నుండి ఏమీ తీయకూడదు."

من فوائد الحديث

  1. ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలని నిర్ణయించిన వ్యక్తి కోసం ప్రకటించబడిన నియమాలు: "ఎవరైతే దుల్-హిజ్జహ్ యొక్క మొదటి 10 రోజులు మొదలైన తర్వాత ఖుర్బానీ చేయాలని నిర్ణయించుకుంటారో, వారు ఆ నిర్ణయం తీసుకున్న సమయం నుండి ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తమ వెంట్రుకలు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించకూడదు, చర్మం నుండి ఏదీ తొలగించకూడదు లేదా కత్తిరించకూడదు (షరియతు మినహాయించిన స్థితిలో తప్ప)
  2. "ఎవరైతే ఈదుల్ అద్హా (10 దుల్-హిజ్జహ్) దినమున ఖుర్బానీ చేయలేదో, వారు 'అయ్యామే తష్రీక్' (11, 12, 13 దుల్-హిజ్జహ్) దినాలలో తమ ఖుర్బానీని పూర్తి చేసే వరకు తమ వెంట్రుకలు, గోర్లు తీయకుండా ఉండాలి."
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (42)