+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَصْحَبُ الْمَلَائِكَةُ رُفْقَةً فِيهَا كَلْبٌ وَلَا جَرَسٌ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2113]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2113]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రయాణంలో ఉన్న వారిని, ఒకవేళ వారి వెంట కుక్క గానీ ఉన్నట్లయితే, లేక వారి వెంట ఉన్న జంతువుల మెడలో, ఆ జంతువులు కదిలినపుడల్లా మ్రోగేలా గంట కట్టి ఉంటే, ఆ ప్రయాణీకులను దైవదూతలు అనుసరించరు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. వేటకు లేదా జంతువుల కాపలాకు తప్ప కుక్కను స్వంతానికి కలిగి ఉండడం నిషేధము.
  2. వెంట అనుసరించని దైవదూతలు ఎవరంటే వారు ‘కారుణ్యపు దైవదూతలు’, రక్షక దైవదూతలు. అల్లాహ్ యొక్క దాసులను వారు వస్తూ పోతూ ఉన్న సమయాలలో ఎప్పుడూ వదిలి వెళ్ళరు.
  3. గంటను మోగించటం నిషేధించడం జరిగింది, ఎందుకంటే అది షైతాను వాద్యాలలో ఒకటి, మరియు యూదులు గంట వాడడాన్ని పోలినట్లుగా ఉంటుంది.
  4. దైవదూతలను దూరంగా ఉంచే ప్రతి విషయం నుండి దూరంగా ఉండే విషయం లో ప్రతి ముస్లిం జాగ్రత్తగా ఉండాలి
ఇంకా