عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ تَدْخُلُ المَلاَئِكَةُ بَيْتًا فِيهِ كَلْبٌ وَلاَ صُورَةٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3322]
المزيــد ...
అబూ తల్హహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3322]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఏ ఇంటిలోనైతే కుక్కగానీ లేక చలనం కలిగిన జీవరాసుల చిత్రపటాలు గానీ ఉన్నట్లైతే ఆ ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించరు. చిత్రపటం అంటే ఆత్మ కలిగిన ప్రాణియొక్క చిత్రపటం అని అర్థం. అటువంటి చిత్రపటం నిషేధము (హరాం), అది అల్లాహ్ యొక్క సృష్ఠి నిర్మాణ లక్షణాన్ని అనుకరించడం అవుతుంది. ఆ విధమైన చిత్రపటాలు బహుదైవారాధనకు దారి తేసే కారణాలలో ఒకటి. కొన్ని చిత్రపటాలైతే అల్లాహ్ కు బదులుగా, లేక అల్లాహ్’తో పాటుగా ఆయనకు సాటిగా పూజించబడుతున్నాయి కూడా. కుక్క ఉన్న ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకపోవడానికి కారణం: ఎందుకంటే కుక్క అశుద్ధమైన పదార్థాలను తింటుంది; వాటిలో కొన్ని కుక్కలు షైతాన్ పేర్లను కూడా కలిగినవి ఉన్నాయి; మరి దైవదూతలు షైతానుకు వ్యతిరేకం కదా. అంతేగాక, కుక్కలనుండి వచ్చే అప్రియకరమైన దుర్వాసన. దైవదూతలు దుర్వాసనను ఇష్టపడరు, అసహ్యించుకుంటారు. మరియు కుక్కలను ఇంటిలో ఉంచుకోవడం హరాం (నిషేధము). కనుక ఎవరైతే తన ఇంటిలో కుక్కలను ఉంచుకుంటాడో, అతని ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకుండా, అతని కొరకు దుఆ చేయకుండా, దైవదూతల కారణంగా అతనిపై అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మరియు అతని ఇంటిలో అల్లాహ్ యొక్క శుభాలు - వీటన్నింటి నుండి దూరం చేసి శిక్షించబడతాడు.