عَن أُمِّ الدَّرْدَاءِ وَ أَبِي الدَّرداءِ رَضيَ اللهُ عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ:
«دَعْوَةُ الْمَرْءِ الْمُسْلِمِ لِأَخِيهِ بِظَهْرِ الْغَيْبِ مُسْتَجَابَةٌ، عِنْدَ رَأْسِهِ مَلَكٌ مُوَكَّلٌ كُلَّمَا دَعَا لِأَخِيهِ بِخَيْرٍ، قَالَ الْمَلَكُ الْمُوَكَّلُ بِهِ: آمِينَ وَلَكَ بِمِثْلٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2733]
المزيــد ...

ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు:
"ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2733]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం కొరకు అతను తన దగ్గర లేనపుడు (అతని పరోక్షంలో) చేసే దుఆకు సమాధానం లభిస్తుంది; ఎందుకంటే అది అతని పట్ల గొప్ప నిజాయితీని ప్రదర్శిస్తుంది. దుఆ చేసే వ్యక్తి తల వద్ద ఒక దైవదూత ఉంటాడు, అతను తన సోదరుడికి మంచి జరగాలని దుఆ చేసినప్పుడల్లా ఆ దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, మరియు నీవు కూడా అదే పొందుతావు”.

من فوائد الحديث

  1. ఇందులో విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు దయగా ఉండాలని, కరుణ కలిగి ఉండాలనే ప్రోత్సాహం ఉన్నది, చివరికి దుఆ చేయునపుడు కూడా.
  2. వారి వీపు వెనక వారి మంచి కొరకు దుఆ చేయడం అనేది విశ్వాసం మరియు సోదరభావం యొక్క నిజాయితీని స్పష్టంగా ప్రదర్శిస్తుంది.
  3. దుఆను వారి సమక్షంలో లేనప్పుడు వారి కొరకు చేయడానికే పరిమితం చేయడం, మీ నిజాయితీని మరియు వారి పట్ల మీ హృదయం ఎప్పుడూ హాజరుగా ఉండడాన్ని మరింత ప్రభావవంతంగా ప్రదర్శిస్తుంది.
  4. దులు స్వీకరించబడటానికి ఒక కారణం ఏమిటంటే, ఒక ముస్లిం తన సోదరుడు తన దగ్గరగా లేనప్పుడు అంటే అతని పరోక్షములో అతని కోసం ప్రార్థించడం.
  5. ఇమాం అన్-నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "ఒక ముస్లిం సోదరుడు తన దగ్గరగా లేనప్పుడు అతని కోసం దుఆ చేయడంలో ఒక ఘనత ఉన్నది. ఒక్కరి కొరకు మాత్రమే కాకుండా, ఎవరైనా ముస్లింల సమూహం కొరకు లేదా ముస్లిం సమాజం కొరకు దుఆ చేసినా, ఈ పుణ్యం లభిస్తుంది. అలాగే అందరు ముస్లింల కొరకు ఎవరైనా వేడుకుంటే (దుఆ చేస్తే) కూడా, ఈ ఘనత లభిస్తుంది." పూర్వ ముస్లింలలో కొందరు తమ స్వయం కొరకు దుఆ చేయాలని అనుకున్నపుడు, వారు తోటి ముస్లిం సోదరుని కొరకు కూడా ఆ దుఆ చేసేవారు, ఎందుకంటే ఆ దుఆకు సమాధానం ఇవ్వబడుతుంది మరియు ఆ కారణంగా తమకు కూడా అదే ప్రసాదించబడుతుంది అని.
  6. ఈ హదీథులో దైవదూతలకు నిర్దేశించబడిన కొన్ని పనుల యొక్క వివరణ ఉన్నది. మరియు వారిలో కొందరు హదీథులో చెప్పబడిన ఈ పని కొరకు నియమించబడినారు అని అర్థమవుతున్నది.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (35)
ఇంకా