عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَالِكٍ ابْنِ بُحَيْنَةَ رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا صَلَّى فَرَّجَ بَيْنَ يَدَيْهِ حَتَّى يَبْدُوَ بَيَاضُ إِبْطَيْهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 390]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మాలిక్ ఇబ్న్ బుహైనహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచేవారు, ఎంతగా అంటే వారి చంకల తెల్లదనము కనిపించేది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 390]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో సజ్దాహ్ చేసినపుడు, సజ్దాహ్ స్థితిలో తన రెండు చేతులను దూరంగా విశాలంగా నేలపై ఆనించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుడి చేతిని కుడి పక్క నుండి, ఎడమ చేతిని ఎడమ ప్రక్క నుండి, పరిచిన రెక్కల మాదిరిగా దేహానికి దూరంగా ఉంచేవారు – ఎంతగా అంటే వారి చంకల చర్మపు ఛాయ కనిపించేది. ఇక్కడ ‘పరిచిన రెక్కల మాదిరి’ అనడంలో అతిశయోక్తి ఉన్నది, అంటే రెండు చేతులను దేహపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచడం అనే విషయం అర్థం కావడం కొరకే.