+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ المَسْجِدَ فَدَخَلَ رَجُلٌ، فَصَلَّى، فَسَلَّمَ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَرَدَّ وَقَالَ: «ارْجِعْ فَصَلِّ، فَإِنَّكَ لَمْ تُصَلِّ»، فَرَجَعَ يُصَلِّي كَمَا صَلَّى، ثُمَّ جَاءَ، فَسَلَّمَ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «ارْجِعْ فَصَلِّ، فَإِنَّكَ لَمْ تُصَلِّ» ثَلاَثًا، فَقَالَ: وَالَّذِي بَعَثَكَ بِالحَقِّ مَا أُحْسِنُ غَيْرَهُ، فَعَلِّمْنِي، فَقَالَ: «إِذَا قُمْتَ إِلَى الصَّلاَةِ فَكَبِّرْ، ثُمَّ اقْرَأْ مَا تَيَسَّرَ مَعَكَ مِنَ القُرْآنِ، ثُمَّ ارْكَعْ حَتَّى تَطْمَئِنَّ رَاكِعًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَعْدِلَ قَائِمًا، ثُمَّ اسْجُدْ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا، وَافْعَلْ ذَلِكَ فِي صَلاَتِكَ كُلِّهَا».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 757]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 757]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆయన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, రెండు రకాతుల నమాజ్ త్వరత్వరగా పూర్తి చేసినాడు — నిలబడడం, రుకూ, సజ్దా ప్రశాంతంగా చేయలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని నమాజ్‌ను గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి నమాజ్ ముగించాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న మస్జిదు మూలకు వచ్చి సలాం చేసినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి సలాంకు సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నీ నమాజ్‌ను మళ్లీ చేయి, ఎందుకంటే నీవు నీ నమాజ్ ను పూర్తిగా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అంతకు ముందు వలే త్వర త్వరగా నమాజ్ పూర్తి చేసినాడు. మళ్లీ వచ్చి ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అతనితో ఇలా పలికినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నీవు ఇంకా నమాజ్ పూర్తిగా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ములను సత్యంతో పంపినవాడిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా చేయలేను. దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు, ముందుగా ప్రారంభ తక్బీర్ చెప్పు. ఆ తరువాత ఖుర్ఆన్ ప్రారంభం (సూరతుల్-ఫాతిహా) మరియు అల్లాహ్ నీకు సాధ్యము చేసినంత ఖుర్ఆన్ భాగాన్ని పఠించు. ఆ తరువాత రుకూలో వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా రుకూ చేయి — అరచేతులతో మోకాళ్ళను గట్టిగా పట్టుకుని, వీపును నేరుగా ఉంచి, శరీరాన్ని పూర్తిగా రుకూలో స్థిరంగా ఉంచు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు — ఎముకలు మళ్లీ సరైన స్థానాల్లోకి వచ్చేలా ప్రశాంతంగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా సజ్దా చేయి — నుదురు, ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాల వేళ్లు నేలపై ఉండాలి. ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చో. ప్రతి రకాతులో ఇదే విధంగా చేయి."

من فوائد الحديث

  1. ఇవి నమాజ్ యొక్క మూలాంశాలు (అర్కానులు). మరచి పోవడం వల్ల గానీ, తెలియకపోవడం వల్ల గానీ వీటిని వదిలేయడం కుదరదు. దీనికి ఆధారంగా — ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని నమాజ్ మళ్లీ చేయమని ఆదేశించారు; కేవలం నేర్పడం మాత్రమే చేయలేదు.
  2. నమాజ్‌లో ప్రశాంతత (తుమఅనీనత్)ను పాటించడం ప్రధాన మూలాంశాలలో (అర్కానులలో) ఒకటి.
  3. నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరు నమాజ్‌లో తప్పనిసరి ఆచరణలు (అర్కానులు) పూర్తి చేయలేదో, వారి నమాజ్ చెల్లదు అని ఇది సూచిస్తున్నది.
  4. నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది సూచించే మరో విషయం ఏమిటంటే — నేర్చుకునే వారితో, తెలియని వారితో మృదువుగా, దయతో వ్యవహరించాలి; వారికి విషయాన్ని స్పష్టంగా వివరించాలి; ప్రధాన లక్ష్యాలను సంక్షిప్తంగా చెప్పాలి; వారి కొరకు అత్యవసరమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి - వారు గుర్తుంచుకోలేని లేదా ఆచరించలేని ఇతర ఉపపూరక విషయాలపై కాకుండా.
  5. నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది సూచించే మరో విషయం ఏమిటంటే — ఒక ముఫ్తీని ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు, ఆ ప్రశ్నించవానికి అవసరమైన మరో విషయం ఏదైనా ఉంటే (అతను అడగకపోయినా), ముఫ్తీ ఆ విషయాన్ని కూడా అతనికి చెప్పడం సిఫార్సు చేయబడింది. ఇది అవసరమైన సలహాగా పరిగణించాలి, అనవసర విషయాల గురించి మాట్లాడటం కాకుండా.
  6. తాను చేసిన తప్పును ఒప్పుకోవడంలో ఉన్న గొప్పతనం, అతను చెప్పిన "నేను దీని కన్నా మెరుగ్గా చేయలేను. కాబట్టి, మీరు నాకు నేర్పండి" అనే మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది.
  7. ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది మంచి పనులను ఆదేశించడాన్ని మరియు చెడు పనులను నిషేధించడాన్ని సూచిస్తుంది. అలాగే, విద్యార్థి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పండితుడిని అడగడం, ఆయనను నేర్పమని కోరడం కూడా ఇందులో ఉంది.
  8. ఎవరినైనా కలిసినప్పుడు సలాం చెప్పడం ముస్తహబ్ (సిఫార్సు చేయబడినది). సలాం చెప్పినప్పుడు దానికి సమాధానం ఇవ్వడం తప్పనిసరి (వాజిబ్). మళ్లీ కలిసినప్పుడు, అంతకు ముందు సలాం చెప్పినప్పటికీ, మళ్లీ సలాం చెప్పడం కూడా సిఫార్సు చేయబడింది. ప్రతి సారి సలాం చెప్పినప్పుడు, ప్రతి సారి దానికి సమాధానం ఇవ్వడం తప్పనిసరి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية Малагашӣ الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా