عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ»، قَالَ عُمَرُ: فَوَاللهِ مَا حَلَفْتُ بِهَا مُنْذُ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنْهَا ذَاكِرًا وَلَا آثِرًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1646]
المزيــد ...
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు.” ఉమర్ రజియల్లాహు అన్హు కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను); రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటను విన్నప్పటినుండి (ఒట్టువేసి) నేను ఏదైనా చెప్పాలన్నా, లేక ఎవరి మాటనైనా (ఒట్టు వేసి) చెప్పాలన్నా ఎప్పుడూ నా తండ్రి, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయలేదు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1646]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాత, ముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయడాన్ని, వారి పేర్లమీద ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. కనుక ఎవరైనా ఒట్టువేయవలసిన, లేక ప్రమాణం చేయవలసిన పరిస్థితివస్తే అల్లాహ్ పేరున ప్రమాణం చేయాలి (ఒట్టువేయాలి); అంతే తప్ప వేరే ఇంకెవరి పేరునా ఒట్టువేయడం లేక ప్రమాణం చేయడం చేయరాదు. తరువాత ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా ప్రస్తావించారు – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటలు విన్నప్పటి నుండి తాను ఆ విధంగా ఎప్పుడూ సంకల్ప పూర్వకంగా గానీ, లేక వేరే వారి మాటల విషయంలో గానీ అల్లాహ్ పేరున తప్ప ఇతరుల పేరున ఒట్టు పెట్టుకోవడం లేక ప్రమాణం చేయడం చేయలేదు.