عن عبد الله بن عكيم رضي الله عنه مرفوعاً: «مَنْ تَعَلَّقَ شيئا وُكِلَ إليه».
[حسن] - [رواه أحمد والترمذي]
المزيــد ...
అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
[ప్రామాణికమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]
ఎవరైతే తన హృదయంతో లేదా కర్మలతో లేదా రెండింటితో పాటు ఏదేని వస్తువు వైపుకు ఆకర్షితులై దానితో ప్రయోజనం ఆశించాలని లేక ఆపదల నుండి రక్షించమని మ్రోగ్గుచూపుతాడో అల్లాహ్ అతను ఆధారపడిన ఆ వస్తువుకు ఆదీన పరుస్తాడు,మరెవరైతే అల్లాహ్ ను అంటిపెట్టుకుని ఉంటారో అతని కార్యసిద్దికి అల్లాహ్ సరిపోతాడు మరియు అతని ప్రతీకష్టాన్ని సులభతరం చేస్తాడు,మరెవరైతే ఇతరత్రా విషయాలను అంటిపెట్టుకుని ఉంటాడో అల్లాహ్ దాని ఆధీనంలోకి చేరుస్తాడు మరియు అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు,