عن أبي الهيَّاج الأسدي قال:
قَالَ لِي عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ: أَلَا أَبْعَثُكَ عَلَى مَا بَعَثَنِي عَلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ أَنْ لَا تَدَعَ تِمْثَالًا إِلَّا طَمَسْتَهُ، وَلَا قَبْرًا مُشْرِفًا إِلَّا سَوَّيْتَهُ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 969]
المزيــد ...
అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 969]
(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసినా దానిని తొలగించకుండా లేదా చెరిపివేయకుండా వదల రాదు అనే నిర్దేశాలతో నలువైపులకు పంపేవారు.
అలాగే తన సహచరులను – ఎత్తుగా కట్టబడి ఉన్న ఏ సమాధినైనా లేదా ఏదైనా కట్టడము నిర్మించబడి ఉన్న ఏ సమాధినైనా సరే, దానిని ధ్వంసం చేయాలని లేదా నేలమట్టం చేయాలని, ఏ సమాధియైనా భూమికి ఒక మూరెడు ఎత్తు మాత్రమే ఉండాలనే నిర్దేశాలతో పంపే వారు.