عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي مَرَضِهِ الَّذِي لَمْ يَقُمْ مِنْهُ:
«لَعَنَ اللهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ» قَالَتْ: فَلَوْلَا ذَاكَ أُبْرِزَ قَبْرُهُ، غَيْرَ أَنَّهُ خُشِيَ أَنْ يُتَّخَذَ مَسْجِدًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 529]
المزيــد ...
ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, తాను కోలుకోలేని అనారోగ్యంతో ఉన్న సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు." ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 529]
ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన తీవ్రమైన అనారోగ్యంతో అంతిమ సమయంలో ఉన్నప్పుడు ఇలా పలికినారు: “అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు మరియు వారిని తన దయ నుండి బహిష్కరించినాడు, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు, వాటిపై కట్టడాలు నిర్మించడం లేదా వాటి దగ్గర ప్రార్థించడం లేదా వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థన చేయడం ద్వారా.” ఇంకా ఆమె రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిషేధం మరియు హెచ్చరిక లేకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధికి కూడా యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధులకు చేసినట్లుగానే జరుగుతుందనే భయం లేకుంటే, ఆయన సమాధి కనిపించేది మరియు ప్రముఖమైనదిగా తయారు చేయబడి ఉండేది.