عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 756]
المزيــد ...
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 756]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేస్తున్నారు: సూరతుల్ ఫాతిహా పఠించబడని సలాహ్ (నమాజు) సరియైనది కాదు; ఎందుకంటే ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించుట సలాహ్ యొక్క అర్కాన్’లలో ఒక రుక్న్ (మూలస్థంభాలలో ఒక మూలస్థంభము).