+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا عَدْوَى، وَلَا طِيَرَةَ، وَيُعْجِبُنِي الْفَأْلُ» قَالَ قِيلَ: وَمَا الْفَأْلُ؟ قَالَ: «الْكَلِمَةُ الطَّيِّبَةُ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2224]
المزيــد ...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి) లేదు, అలాగే ఏ “తియరహ్” (అపశకునము) లేదు; అయితే “అల్ ఫా’ల్” ను (మంచి శకునాన్ని) నేను ఇష్టపడతాను”. ఆయన వద్ద ఉన్న వారు ప్రశ్నించారు “అల్ ఫా’ల్” అంటే ఏమిటి?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఒక మంచి మాట” అన్నారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2224]

వివరణ

ఇస్లాంకు పూర్వ అజ్ఞాన యుగంలో ప్రజలు, అల్లాహ్ ఆదేశం తో నిమిత్తం లేకుండా అంటువ్యాధి దానంతట అదే ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని విశ్వసించేవారు; అల్లాహ్ ఆదేశం లేకుండా ఇతరులకు వ్యాపిస్తుందని భావించడం తగదు అని అది అసత్యము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. మరియు ‘అత్’తియరహ్’ (దుశ్శకునం), అంటే ఏదైనా ధ్వని వినడం, లేదా ఏదైనా ఎదురుకావడం లేదా దేనినైనా చూడడం వలన అయిష్టమైనది ఏదైనా జరుగవచ్చునని విశ్వసించడం – ఉదాహరణకు ఏవైనా పక్షులు, లేదా జంతువులు, లేదా ఏదైనా అంగవైకల్యం కలిగిన వారు ఎదురుకావడం మొ.; అలాగే ప్రత్యేకమైన అంకెలను దుశ్శకునంగా విశ్వసించడం, ప్రత్యేక దినములను దుశ్శకునపు దినాలుగా విశ్వసించడం లేదా ఇటువంటి ఇంకా ఏదైనా. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ‘తియరహ్’ ను (పక్షిని) ప్రస్తావించినారు. ఎందుకంటే ఇది ఇస్లాం పూర్వ అజ్ఞాన యుగంలో ప్రజల మధ్య బాగా ప్రసిద్ధి చెందిన ఒక ఆచారంగా ఉండింది. దానికి మూలం ఏమిటంటే ఆ కలం లో ప్రజలు ఏదైనా పని తలపెట్టాలని సంకల్పించినపుడు, అంటే ఉదాహరణకు ఏదైనా దూరప్రయాణానికి సంకల్పించినా లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి సంకల్పించినా లేక ఇంకేదైనా పనికి సంకల్పించినా ముందుగా ఒక పక్షిని గాలిలోనికి ఎగురవేసేవారు. ఆ పక్షి కుడివైపునకు మళ్ళితే అది మంచి శకునంగా సంకల్పించిన పనిని మొదలుపెట్టేవారు, ఎడమ వైపునకు మళ్ళితే చెడు శకునంగా భావించి తలపెట్టిన పనిని మొదలుపెట్టకుండా వాయిదా వేసుకునేవారు లేదా దానిని విడిచి పెట్టేసే వారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను ‘అల్ ఫా’ల్’ (మంచి శకునాన్ని) ఇష్టపడతానని చెప్పారు, ఇది ఒక వ్యక్తికి ఒక మంచి మాట, ఒక మంచి వార్త విన్నపుడు అతనికి కలిగే ఆనందము, సంతోషము, హర్షము మొదలైనవి. అది ఒక దాసునికి తన ప్రభువుపై మంచి అపేక్ష కలిగి ఉండేలా చేస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الولوف
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పైనే ఆధారపడాలని మరియు అల్లాహ్ తప్ప మరెవరూ మంచిని తీసుకురాలేరని మరియు అల్లాహ్ తప్ప ఎవరూ హానిని నివారించలేరని విశ్వసించాలని తెలియుచున్నది.
  2. ఇస్లాం లో ‘తియరహ్’ నిషేధించబడింది. తియరహ్ అంటే చెడు సంకేతాలను విశ్వసించడం మరియు దాని ఆధారంగా పనులు చేయకుండా ఉండిపోవడం.
  3. ‘అల్ ఫా’ల్’ (మంచి శకునం) నిషేధించబడిన ‘తియరహ్’ లో భాగం కాదు. అది సర్వోన్నతుడైన అల్లాహ్’ పై మంచి అపేక్ష కలిగి ఉండేలా చేస్తుంది
  4. అల్లాహ్ యొక్క పూర్వనిర్దిష్టానికి (ఆయన ఆదేశానికి, అల్ ఖద్ర్ కు) అనుగుణంగానే ప్రతిదీ జరుగుతుంది, ఆయన సర్వశక్తిమంతుడు మరియు ఏ భాగస్వామి లేని ఏకైకుడు.
ఇంకా