عن أبي مَرْثَدٍ الغَنَوِيّ رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لَا تَجْلِسُوا عَلَى الْقُبُورِ، وَلَا تُصَلُّوا إِلَيْهَا».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 972]
المزيــد ...

అబూ మర్తద్ అల్ ఘనవియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 972]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులపై కూర్చోవడాన్ని నిషేధించినారు.
అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధుల ఎదురుగా నమాజు చేయడాన్ని, ఖిబ్లా వైపునకు సమాధి ఉండేలా నమాజు ఆచరించడాన్ని నిషేధించినారు. ఎందుకంటే అది ‘షిర్క్’ (బహుదైవారాధనకు) దారితీసే కారణాలలో ఒకటి కనుక.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. కేవలం ‘జనాజా నమాజు’ (మృతుని ఖననం చేయుటకు ముందు ఆచరించబడే నమాజు) తప్ప, స్మశానంలో, మరియు సమాధుల మధ్య, లేదా సమాధుల వైపు నమాజు ఆచరించుట నిషేధము.
  2. సమాధుల వైపునకు తిరిగి నమాజు ఆచరించుట నిషేధమనేది బహుదైవారాధన యొక్క మూలాన్ని మూసివేయడమే.
  3. సమాధులకు సంబంధించి ఇస్లాం రెండు విపరీత ఆచరణలను నిషేధిస్తున్నది – సమాధులకు అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, అలాగే సమాధుల పట్ల నిర్లక్ష్యంగా, అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించడం. ఈ రెండూ నిషేధమే.
  4. (మరొక హదీసులో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన దానిని అనుసరించి ఒక ముస్లిం చనిపోయిన తరువాత కూడా అతని గౌరవం, మాన్యత, పవిత్రత అలాగే నిలిచి ఉంటాయి. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “చనిపోయిన వాని ఎముకలు విరచడం, బ్రతికి ఉన్న వాని ఎముకలు విరచడముతో సమానము).
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (63)
ఇంకా