+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ تَعَالَى فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلَّا ظِلُّهُ: إِمَامٌ عَدْلٌ، وَشَابٌّ نَشَأَ فِي عِبَادَةِ اللَّهِ، وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي المَسَاجِدِ، وَرَجُلاَنِ تَحَابَّا فِي اللَّهِ، اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ، وَرَجُلٌ دَعَتْهُ امْرَأَةٌ ذَاتُ مَنْصِبٍ وَجَمَالٍ فَقَالَ: إِنِّي أَخَافُ اللَّهَ، وَرَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لاَ تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ، وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا، فَفَاضَتْ عَيْنَاهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1423]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1423]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు రకాల విశ్వాసులకు శుభవార్త చెప్పారు — ప్రళయ దినం నాడు, అల్లాహ్ అర్జ్ (సింహాసనం) నీడ తప్ప మరే నీడ ఉండని రోజున, వారిని అల్లాహ్ తన ప్రత్యేక నీడలో రక్షిస్తాడు. మొదటి వాడు: తన వ్యక్తిత్వంలో న్యాయవంతుడు అయిన ఇమాం (పాలకుడు), పాపిష్టి కాని, తన ప్రజల మధ్య న్యాయం చేసే, అన్యాయం చేయని వ్యక్తి. అతను 'అల్విలాయత్ అల్-ఉజ్మా' (అత్యున్నత అధికారం) కలిగినవాడు, ముస్లిముల వ్యవహారాల్లో ఏదైనా బాధ్యతను తీసుకున్నవారు మరియు ఆ బాధ్యతలో న్యాయం చేసినవారు కూడా ఈ (న్యాయమైన పాలకుడి) వర్గంలోకి వస్తారు. రెండవవాడు: అల్లాహ్ ఆరాధనలో పెరిగిన యువకుడు, తన యవనాన్ని, చురుకుతనాన్ని అంతటినీ అల్లా‌హ్ ఆరాధనకే అంకితం చేసినవాడు, మరియు అదే స్థితిలో మరణించినవాడు. మూడవ వాడు: ఒక వ్యక్తి – అతని హృదయం మస్జిద్‌తో ముడిపడి ఉంటుంది. అతను మస్జిద్ నుండి బయటకు వచ్చినా, తిరిగి మస్జిద్‌కు వెళ్లాలనే కోరికతో ఉంటాడు. అతనికి మస్జిద్‌పై ఎంతో ప్రేమ, అతను తరచూ మస్జిద్‌లో ఉండే అలవాటు కలవాడు. అతని శరీరం మస్జిద్ వెలుపల ఉన్నా, హృదయం మాత్రం ఎప్పుడూ మస్జిద్‌లోనే ఉంటుంది. నాలుగవ వాడు: ఇద్దరి వ్యక్తులు – వారు పరస్పరం అల్లాహ్ కోసం నిజమైన ప్రేమతో ప్రేమించేవారు. వారి మధ్య ఉన్న ప్రేమ, ధర్మం (దీను) ఆధారంగా ఉండేది, ప్రపంచ విషయాల వల్ల ఆ బంధాన్ని విడిచి పెట్టరు. వారు కలిసినా, కలవకపోయినా, చివరకు మరణమే వారిని వేరు చేసింది. ఐదవ వాడు: ఒక పురుషుడు - ఒక మహిళ అతన్ని పాపానికి (అనైతిక చర్యకు) పిలిచింది. ఆమెకు మంచి వంశపారంపర్యం, ప్రతిష్ట, ధనం, అందం అన్నీ ఉన్నాయి. కానీ, అతను ఆమెను తిరస్కరించి ఇలా అన్నాడు: "నేను అల్లాహ్‌ నుండి భయపడుతున్నాను." ఆరవ వాడు - అలాంటి వారు - ఎవరైతే తక్కువగా లేదా ఎక్కువగా దానం చేసి, దాన్ని ప్రదర్శించకుండా రహస్యంగా చేస్తారో—ఎంతగా అంటే ఎడమ చేతికి కుడి చేతి ఏమి ఇచ్చిందో తెలియదు—అటువంటి వారు. ఏడవ వాడు: ఒక వ్యక్తి — ఒంటరిగా ఉన్నప్పుడు, తన హృదయంలో లేదా నోటితో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుంటూ (ధ్యానం చేస్తూ), అల్లాహ్ భయంతో, గౌరవంతో తన కన్నీళ్లను ఆపుకోలేక పోయినవాడు.

من فوائد الحديث

  1. ప్రస్తావించబడిన ఏడు వర్గాల వ్యక్తులు పొందే గొప్ప పుణ్యాన్ని వివరించడం, అలాగే వారిని అనుసరించాలన్న ప్రేరణను ఇవ్వడం.
  2. ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ తన వ్యాఖ్యలో "ఫీ దిల్లిహి (في ظله)" అన్న పదంపై ఇలా చెప్పారు: "ఇక్కడ అర్థం అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసనం) నీడ అని చెప్పబడింది." దీనికి సాక్ష్యంగా సల్మాన్ నుండి సయీద్ బిన్ మంసూర్ వద్ద ఉన్న హసన్ ఇస్నాద్ తో వచ్చిన హదీథు ఉంది: "ఏడు మంది అల్లాహ్ తన అర్జ్ నీడలో రక్షిస్తాడు."
  3. ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ: "అల్-ఆదిల్ (న్యాయవంతుడు)" అనే పదానికి అత్యుత్తమ వివరణ: "అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి, ప్రతి విషయాన్ని సమతుల్యంగా (అతిగాకుండా, లోపించకుండా) దాని సరైన స్థానంలో ఉంచే వ్యక్తి." ఈ లక్షణాన్ని ప్రత్యేకంగా మొదటి స్థానంలో ప్రస్తావించడానికి కారణం: ఇది సార్వత్రికంగా ప్రయోజనకరమైనది.
  4. ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత
  5. నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఈ హదీథులో అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించడాన్ని ప్రోత్సహించడం ఉంది. మరియు దాని గొప్ప ఫలితం (ప్రాముఖ్యత) యొక్క వివరణ ఉంది."
  6. "వంశం మరియు అందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ఉద్దేశ్యం — మనుషులు వీటి కోసం అత్యంత ఆసక్తి చూపుతారు, వాటిని పొందాలనే తపన ఎక్కువగా ఉంటుంది,
  7. అలాంటివి సాధించడం కూడా చాలా కష్టం."
  8. దానం (సదఖా) చేయడంలో రహస్యంగా ఇవ్వడం ఉత్తమం, ప్రదర్శన (రియా) నుండి దూరంగా ఉండాలి. అయితే, దానం లేదా జకాత్‌ను బహిరంగంగా ఇవ్వడం కూడా షరీఅత్‌లో అనుమతించబడింది — అది ప్రదర్శన కోసం కాకుండా, ఇతరులను ప్రోత్సహించడానికి, వారు కూడా దానం చేయాలని ప్రేరణ కలిగించడానికి, ఇస్లాం ధర్మ చిహ్నాలను ప్రజల్లో చూపించడానికి అయితే, అది కూడా మంచిదే."
  9. ఈ ఏడుగురు ధన్యులు అల్లాహ్ కోసం శుద్ధమైన నిష్కపటత (ఇఖ్లాస్)తో, తమ స్వీయ కోరికలకు (హవా) వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ఆ పరమానందాన్ని (ప్రళయ దినంలో అల్లాహ్ నీడ) పొందారు.
  10. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఏడుగురిని అల్లాహ్ తన నీడలో రక్షిస్తాడు" అని చెప్పడంలో ఈ సంఖ్య (ఏడు) మాత్రమే పరిమితి అని అర్థం కాదు. హదీథులో చెప్పిన ఈ వర్గాల కంటే
  11. ఇంకా ఇతర వర్గాలవారు కూడా అల్లాహ్ అర్ష్ నీడలో రక్షణ పొందుతారు అని ఇతర హదీథులలో కూడా వచ్చింది.
  12. ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో "పురుషులు" అని ప్రస్తావించడంలో ప్రత్యేక అర్థం లేదు; ఇక్కడ చెప్పిన మంచి కార్యాలలో, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా భాగస్వాములే. కేవలం "న్యాయపాలకుడు" (ఇమామ్ అద్దల్) అన్నప్పుడు "అత్యున్నత పదవిలో ఉన్న పాలకుడు" అనే అర్థం ఉంటే తప్ప, లేదా ఒక మహిళ తన కుటుంబాన్ని న్యాయంగా పాలిస్తే ఆమె కూడా ఈ వర్గంలోకి వస్తుంది. "మస్జిద్‌లో ఎక్కువగా ఉండే వ్యక్తి" అన్న విషయాన్ని మినహాయించాలి, ఎందుకంటే మహిళకు తన ఇంట్లోనే నమాజు చేయడం మస్జిద్‌లో చేయడానికంటే ఉత్తమం. ఇతర అన్ని లక్షణాల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఈ ప్రతిఫలానికి అర్హులు. అదే విధంగా, "ఒక మహిళ పాపానికి పిలిచినప్పుడు పురుషుడు తిరస్కరించడం" అన్న విషయాన్ని మహిళలకూ వర్తింపజేయవచ్చు — ఉదాహరణకు, ఒక మహిళను ఒక అందమైన రాజు పాపానికి పిలిచినప్పుడు, ఆమె అల్లాహ్ భయంతో తిరస్కరించడాన్ని కూడా ఇందులో చేర్చవచ్చు.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా