عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ يَرْضَى لَكُمْ ثَلَاثًا، وَيَكْرَهُ لَكُمْ ثَلَاثًا، فَيَرْضَى لَكُمْ: أَنْ تَعْبُدُوهُ، وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا، وَأَنْ تَعْتَصِمُوا بِحَبْلِ اللهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا، وَيَكْرَهُ لَكُمْ: قِيلَ وَقَالَ، وَكَثْرَةَ السُّؤَالِ، وَإِضَاعَةِ الْمَالِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1715]
المزيــد ...
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా పలికినారు:
“నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1715]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల నుండి మూడు లక్షణాలను ఇష్టపడతాడని మరియు వారిలో మూడు లక్షణాలను ఇష్టపడడు అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేశారు. వారు ఆయన ఏకత్వాన్ని ధృవీకరించుట మరియు ఆయనతో దేనినీ సమానులుగా చేయకుండా ఉండుట; వారు అల్లాహ్ యొక్క నిబంధనకు, ఖురాన్‌కు మరియు ఆయన ప్రవక్త (స) సున్నత్‌కు కట్టుబడి ఉండుట మరియు వారు ముస్లిం సమాజం నుండి విడిపోకుండా ఐకమత్యంగా ఉండుట. ఆయన వారి కొరకు ఇష్టపడని విషయాలు: వారికి సంబంధం లేని విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడటం; జరగని విషయాల గురించి ప్రశ్నించడం; ఇతరుల వద్ద ఉన్న దానిని గురించి, ఉదా: డబ్బును గురించి, లేదా అవసరం లేని వాటిని ప్రజల నుండి అడగడం; (అంటే అవసరం ఉన్నా లేకపోయినా అడుక్కొనుట, బిచ్చమెత్తుట); లేదా దేనిగురించైనా అతిగా ప్రశ్నించుట; డబ్బును వృధా చేయడం, దాని చట్టబద్ధమైన ఉపయోగాలకు భిన్నంగా ఖర్చు చేయడం మరియు సంపదను నష్టానికి గురి చేయడం.