+ -

عَن أَبي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ يُشِيرُ أَحَدُكُمْ عَلَى أَخِيهِ بِالسِّلاَحِ، فَإِنَّهُ لاَ يَدْرِي، لَعَلَّ الشَّيْطَانَ يَنْزِعُ فِي يَدِهِ، فَيَقَعُ فِي حُفْرَةٍ مِنَ النَّارِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7072]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 7072]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన సహోదర ముస్లింకు ఎలాంటి ఆయుధాన్నీ (కత్తి, తుపాకీ, మొదలైనవి) చూపించకూడదని, ఉద్దేశపూర్వకంగానైనా లేదా సరదాగానైనా సరే అలా చేయవద్దని హెచ్చరించారు. ఎందుకంటే, షైతాను అతడిని (తొందరపాటులో, కోపంలో) ఆ ఆయుధాన్ని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు; దాంతో అతను తన సహోదరుడిని గాయపరచ వచ్చు లేదా చంపవచ్చు. అలా జరిగితే, అతను పెద్ద పాపంలో పడిపోతాడు, దాని ఫలితంగా నరకంలో పడే ప్రమాదమూ ఉంది.

من فوائد الحديث

  1. ముస్లిం రక్తం యొక్క పవిత్రతపై వివరణ
  2. ఒక ముస్లిమ్‌ తోటి ముస్లింను గౌరవించడం తప్పనిసరి మరియుఅతడు తన చేష్టల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే ఇతరులకు హాని కలిగించకూడదని నిశ్చయంగా ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలాంటి హానికరమైన కార్యాల్లో ఒకటి — ఏదైనా ఇనుప వస్తువును లేదా ఆయుధాన్ని తన ముస్లిం సోదరుని వైపు చూపించడం, సరదాగా అయినా, పరిహాసానికి అయినా అలా చేయకూడదు. ఎందుకంటే: షైతాను అతని చేతిని ప్రేరేపించి, ఆ సోదరునిపై దాడి చేయాలనే ఆలోచనను అతనిలో కలిగించ వచ్చు. లేదా షైతాన్ అతని చేతిలోని ఆయుధాన్ని అలనాలోచితంగా విసిరి వేయించి, అది అతడి సోదరుడికి తగిలేలా చేసి, అతడికి హాని జరిగేలా చేయవచ్చు.
  3. నిషేధించబడినదానికి దారి తీసే పనులను నిషేధించడం ద్వారా వాటి మార్గాలను పూర్తిగా అడ్డుకోవడం.
  4. సమాజ భద్రత మరియు ప్రజల మధ్య సంబంధాలను కాపాడుకోవడంపై శ్రద్ధ వహించాలి. సూచించడం లేదా బెదిరించడం ద్వారా కూడా ఎవరినీ భయభ్రాంతులను చేయకూడదు.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية
అనువాదాలను వీక్షించండి