عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: مَا خَطَبَنَا نَبِيُّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَّا قَالَ:
«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ، وَلَا دِينَ لِمَنْ لَا عَهْدَ لَهُ».

[حسن لغيره] - [رواه أحمد] - [مسند أحمد: 12383]
المزيــد ...

అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను ఉద్దేశ్యించి ఎప్పుడు ప్రసంగించినా ఇలా అనకుండా ఎప్పుడూ లేరు:
“చిత్తశుధ్ధి (నైతిక నిష్ట, న్యాయవర్తన) లేని వానికి విశ్వాసం లేదు; మరియు (ఇతరులతో) తనకు ఉన్న ఒడంబడికను పాటించని వ్యక్తికి ధర్మం లేదు.”

[హసన్ హదీథు] - [ఆహ్మద్ నమోదు చేసినారు:] - [ముస్నద్ అహ్మద్ - 12383]

వ్యాఖ్యానము

అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రెండు విషయాలను ప్రస్తావించకుండా ఉపన్యాసం లేదా ఉపదేశాన్ని ఇవ్వడం చాలా అరుదు. మొదటిది: ఎవరి విషయంలోనైనా - అతని సంపద, లేదా అతని కుటుంబము విషయంలో ద్రోహం చేయాలనే తలంపు మనసులో ఉన్న వ్యక్తికి పూర్తి విశ్వాసం ఉండదు. రెండవది: ఇతరులతో తనకు ఉన్న, లేదా ఇతరులతో తాను చేసుకున్న ఒప్పందాలను, ఒడంబడికను పాటించని వ్యక్తికి సంపూర్ణమైన ధర్మము లేదు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఈ హదీథు ‘అమానతులను’ (మనపై నమ్మకం మరియు విశ్వాసముతో ఇతరులు మనవద్ద ఉంచిన వారి సంపదలు, విషయములు మొ. ద్రోహానికి పాల్బడకుండా వాటిని) నెరవేర్చడం; ఇతరులతో మనకు ఉన్న ఒడంబడికలు మరియు ఒప్పందాలను పాటించడం పట్ల ప్రోత్సహిస్తున్నది, ఎందుకంటే వాటిని నెరవేర్చకపోవడం నమ్మకాన్ని విశ్వాసాన్ని రూపుమాపుతుంది, కోల్పోయేలా చేస్తుంది.
  2. ఇందులో నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా మరియు ఒడంబడికలను ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది, ఎందుకంటే ఇవి పెద్ద పాపాలు.
  3. ఈ హదీసులో అల్లాహ్’కు మరియు ఆయన దాసునికి మధ్య, మరియు సృష్టికి మధ్య ఉన్న నమ్మకాలను మరియు ఒడంబడికలను కాపాడటం ఉన్నది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الإندونيسية البنغالية ఇంకా (32)
ఇంకా