عَنْ أَبِي شُرَيْحٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ»، قِيلَ: وَمَنْ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «الَّذِي لاَ يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6016]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో."
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6016]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మూడుసార్లు ప్రమాణం చేసి మరీ, తను చెప్పబోతున్న విషయంలోని గంభీరతను ధృవీకరించారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు," దానికి సహచరులు ఆయనను ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! ఎవరు విశ్వాసి కాడు?" అపుడ ఆయన ఇలా జవాబు ఇచ్చారు: "పొరుగువాడు ఎవరి ద్రోహం, అన్యాయం మరియు చెడుకు భయపడతాడో, అతడు (ముమిన్ అంటే విశ్వాసి కాజాలడు)."