عَنْ أَبِي ذَرٍّ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَبَا ذَرٍّ إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا، وَتَعَاهَدْ جِيرَانَكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2625]
المزيــد ...
అబూ దర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2625]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ దర్ అల్-గిఫారి (రదియల్లాహు అన్హు)ని ఉడకబెట్టిన పులుసు వండేటప్పుడు, దానిలో నీటిని (నీటి శాతాన్ని) మరియు దాని నిల్వను పెంచాలని మరియు అతను తన పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు దానితో వారిని పరామర్శించాలని ఉద్బోధించినారు.