عن ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ: يَا كَافِرُ، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا، إِنْ كَانَ كَمَا قَالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 60]
المزيــد ...
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 60]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునితో "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అనకూడదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విధంగా అవిశ్వాసి అని అనడం వలన, ఆ మాట వారిద్దరిలో ఒకరిపై పడుతుంది: అది నిజంగా అతనికి సరిపోతే, అప్పుడు ఆ మాట అతను అలా అన్న వ్యక్తిపై పడుతుంది; ఒకవేళ అలా లేకపోతే, ఆ నింద తిరిగి చెప్పినవాడిపైనే పడుతుంది.