عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«لَا يَمْنَعَنَّ رَجُلًا مِنْكُمْ مَخَافَةُ النَّاسِ أَنْ يَتَكَلَّمَ بِالْحَقِّ إِذَا رَآهُ أَوْ عَلِمَهُ».
[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [مسند أحمد: 11403]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”
[దృఢమైనది] - - [مسند أحمد - 11403]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులకు ఒక ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన(స) సిఫార్సు చేసిన విషయాలలో ప్రజల భయం, భీతి మరియు వారి శక్తి ఒక ముస్లిం సత్యాన్ని చూసి ఉన్నా లేదా సత్యమేమితో అతనికి తెలిసినా సత్యాన్ని మాట్లాడకుండా లేదా ఆజ్ఞాపించకుండా, అవి అతనికి నిరోధము కారాదని అన్నారు.