عن عائِشَة رضي الله عنها مرفوعاً: «لا صلاة بِحَضرَة طَعَام، وَلا وهو يُدَافِعُه الأَخبَثَان».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ఆయెషా రజియల్లాహు అన్హా మర్ఫు ఉల్లేఖనం“భోజనం సిద్దంగా ఉన్నప్పుడూ నమాజు లేదు మరియు మలమూత్రాలు కలిగినప్పుడు (అవసరం ఉన్నప్పుడూ) వాటిని పూర్తి చేసుకోనంత వరకు నమాజు అవ్వదు
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీస్ ద్వారా తాకీదుపరుస్తున్న విషయం ‘-దాసుడు తన ప్రభువు ఎదుట నమాజు కొరకు మనసును సంపూర్ణంగా లగ్నపరుస్తూ చిత్తశుద్దితో నిలబడాలని కోరడం జరుగుతుంది,ఇది జరగాలంటే మనిషి చిత్తశుద్దిని,శాంతిని భంగ పరిచే కారకాలను,(కార్యాలను) దూరం చేసుకోవాలి,అంచేత మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోజనం సిద్దంగా ఉన్నప్పుడూ నమాజు చదవకూడదని వారించారు ఎందుకంటే దానివల్ల నమాజుచేసే వ్యక్తి మనస్సు భోజనం వైపు లాగబడుతుంది,అతని హృదయం అటువైపు మరలుతూ ఉంటుంది,ఇదే విధంగా తీవ్ర మలమూత్ర అవసరమున్నప్పుడు కూడా నమాజు చదవకూడదని చెప్పడం జరిగింది,ఎందుకంటే మనిషి దాని ఒత్తిడి వల్ల మనసును నమాజుపై కేంద్రీకరించలేడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మలముత్ర విసర్జనల అవసరం కలిగినప్పుడు సమయం తీరిక ఉన్నప్పటికి నమాజుకు హాజరవ్వడం ఒక మక్రూహ్ చర్య అవుతుంది,ఒక వేళ అలాంటి స్థితిలోనే నమాజు చదివితే అతని నమాజు తీరిపోతుంది కానీ ప్రస్తావించిన హదీసు ప్రకారంగా అది పరిపూర్ణమవ్వదు,అసంపూర్ణంగా మిగిలి పోతుంది,తిరిగి ఆచరించాల్సిన అవసరము లేదు.ఇక ఒక వ్యక్తి నమాజు కై నిలబడినప్పుడు అతనికి మలమూత్ర అవసరం ఏర్పడలేదు కానీ నమాజు మధ్యలో అతనికి ఆ అవసరం ఏర్పడింది, నమాజు పూర్తిచేయడాన్నికనుక అది నిరోధించనప్పుడు ఆ వ్యక్తి యొక్క నమాజు ప్రామాణికం అవుతుంది,మక్రూహ్ అవ్వదు.
  2. ప్రామాణిక నమాజు కొరకు హృదయాన్ని లగ్నపర్చడం,శ్రద్ద,ఏకాగ్రతలు ఖచ్చితంగా కావల్సిన విషయాలు.
  3. నమాజు ఆచరించే వ్యక్తి నమాజు నుండి మళ్లించే విషయాలను ఖచ్చితంగా తొలగించుకుని పూర్తి చేసుకోవాలి.
  4. మలమూత్ర విసర్జనల అవసరం జుమా మరియు జమాత్ ను విడిచిపెట్టడానికి సాకుగా మారుతాయి,ఒకవేళ అవి ఆ నమాజు ఖచ్చిత వేళలో ఏర్పడినట్లైతే.