عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ السَّاعَةِ، فَقَالَ: مَتَى السَّاعَةُ؟ قَالَ: «وَمَاذَا أَعْدَدْتَ لَهَا». قَالَ: لاَ شَيْءَ، إِلَّا أَنِّي أُحِبُّ اللَّهَ وَرَسُولَهُ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ». قَالَ أَنَسٌ: فَمَا فَرِحْنَا بِشَيْءٍ، فَرِحْنَا بِقَوْلِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ» قَالَ أَنَسٌ: فَأَنَا أُحِبُّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبَا بَكْرٍ، وَعُمَرَ، وَأَرْجُو أَنْ أَكُونَ مَعَهُمْ بِحُبِّي إِيَّاهُمْ، وَإِنْ لَمْ أَعْمَلْ بِمِثْلِ أَعْمَالِهِمْ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3688]
المزيــد ...
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్‌లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3688]
ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” అని అడిగాడు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని: “ఆ ఘడియ కొరకు నీవు ఏ ఏ సత్కార్యాలు ఆచరించి సిద్ధపరుచుకున్నావు?” అని ప్రశ్నించారు.
ప్రశ్నించిన వ్యక్తి : "నేను అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తున్నాను; అది తప్ప ప్రళయ ఘడియ కోసం నేను ఏ గొప్ప ఆచరణలను సిద్ధం చేసుకోలేదు" అన్నాడు; మరియు దీనిని గమనించినట్లయితే అతడు హృదయపు ఆరాధనలను, శరీరక ఆరాధనలను లేదా ఆర్థిక పరమైన ఆరాధనలను, లేక ఇతర ఏ ఆరాధనలను ప్రస్తావించలేదు; ఎందుకంటే అవన్నీ ప్రేమ యొక్క శాఖలు మరియు అవన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. నిజమైన ప్రేమ ఆ వ్యక్తిని ధర్మబద్ధమైన పనులలో కష్టపడటానికి ప్రేరేపిస్తుంది.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, స్వర్గములో నీవు వారితో ఉంటావు.”
ఈ శుభవార్త పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు అమితంగా సంతోషపడినారు.
అనస్ రదియల్లాహు అన్హు – తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా లను ప్రేమిస్తున్నానని; దాని కారణంగా, వారి అంత గొప్పగొప్ప ఆచరణలు ఆచరించలేకపోయినా, స్వర్గములో వారితో పాటు ఉంటాననే ఆశాభావమును వ్యక్తపరిచినారు.