హదీసుల జాబితా

“భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”
عربي ఇంగ్లీషు ఉర్దూ