+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ صَامَ يَوْمًا فِي سَبِيلِ اللهِ بَاعَدَ اللهُ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِينَ خَرِيفًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1153]
المزيــد ...

అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఎవరైతే ‘అల్లాహ్ మార్గములో’ ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై సంవత్సరాల (దూరం) వరకు దూరం చేస్తాడు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1153]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా స్పష్టపరుస్తున్నారు: ఎవరైతే జిహాద్‌లో అల్లాహ్ కోసం నిజాయితీగా, కేవలం పుణ్యఫలాన్ని, ప్రతిఫలాన్ని ఆశిస్తూ, ఒక రోజు ఉపవాసం ఉంటారో - ఈ విషయంలో “జిహాద్‌లో లేదా ఇతరత్రా ఉపవాసం ఉంటారో” అని కూడా అనబడింది - అప్పుడు అల్లాహ్ తన దయతో, అనుగ్రహంతో డెబ్బై సంవత్సరాల పాటు అతడిని నరకాగ్ని నుండి దూరం చేస్తాడు.

من فوائد الحديث

  1. ఇమాం నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో అల్లాహ్ మార్గంలో ఉపవాసం ఉండటం యొక్క ఘనత మరియు దాని వల్ల కలిగే ప్రయోజనం తెలుస్తున్నాయి. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది ఉపవాసం పాటించడం వల్ల హాని జరగని వారికి, దాని వల్ల జిహాద్ యొక్క ఎటువంటి హక్కులను విస్మరించని వారికి మరియు ఉపవాసం వల్ల జిహాద్ లో అతని పోరాట సామర్థ్యం దెబ్బతినని వారికి లేదా ఉపవాసం కారణంగా అతనికి నిర్దేశించబడిన పోరాట లక్ష్యాలు నెరవేర్చుట ప్రభావితం కాని వారికి మాత్రమే వర్తిస్తుంది.
  2. ఇందులో స్వచ్ఛంద ఉపవాసాలు పాటించుట పట్ల ప్రోత్సాహం ఉన్నది.
  3. ఉపవాసం పాటించుటలో నిజాయితీ, కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, ఆయన కరుణ పొందడం మాత్రమే లక్ష్యంగా ఉంచుకోవడం విధి (వాజిబ్). ఉపవాసం పాటించుట అనేది లోకులకు ప్రదర్శించడానికో, కీర్తి సంపాదించుట కొరకో లేక ఇతర ప్రయోజనాలు ఆశించో చేయరాదు.
  4. అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన “ఫీ సబీలిల్లాహ్” (అల్లాహ్ మార్గములో) అనే మాట యొక్క అర్థం “కేవలం నిజాయితీ కలిగిన సంకల్పం కలిగి ఉండుట” అనే అర్థం కావచ్చు, లేదా “జిహాద్’లో యోధునిగా ఉన్న స్థితిలో కూడా ఉపవాసం పాటించుట” అనే అర్థం కావచ్చు. రెండవది మరింత దగ్గరి అర్థాన్నిస్తున్నది.
  5. (హదీథులో “ఖరీఫన్” అనే పదం ఉపయోగించబడింది. ‘ఖరీఫ్’ అంటే ‘శరదృతువు’ అని అర్థం. కనుక "డెబ్బై శరదృతువులు" అంత దూరం చేస్తాడు అని అర్థం.)
  6. ఇమాం ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: నిజానికి "డెబ్బై శరదృతువులు" అనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ అర్థం మొత్తం సంవత్సరం అని. వేసవి, శీతాకాలం మరియు వసంతకాలం వంటి ఇతర రుతువుల కంటే శరదృతువు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం - శరదృతువు అత్యంత సారవంతమైనది కనుక, ఎందుకంటే ఆ సమయంలో పంటలు, పండ్లు పండించబడతాయి కనుక – అని అర్థమవుతున్నది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Урумӣ Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి