+ -

عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1098]
المزيــد ...

సహ్ల్ బిన్ సఅ్’ద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఉపవాస విరమణలో త్వరపడినంత కాలం ప్రజలు శుభాన్ని కలిగి ఉంటారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1098]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సూర్యుడు అస్తమించినాడని నిర్ధారించుకున్న తరువాత, సున్నత్ ను పాటిస్తూ, ఉపవాసం విరమించడానికి విధించబడిన పరిమితులను పాటిస్తూ, ఉపవాసం విరమించడానికి తొందరపడినంత కాలం ప్రజలు “ఖైర్”ని (శుభాన్ని) కలిగి ఉంటారు.”

من فوائد الحديث

  1. ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: సూర్యాస్తమయాన్ని ధృవీకరించుకున్న తరువాత ఉపవాస విరమణను వేగవంతం చేయమని ఈ హదీథు ప్రోత్సహిస్తున్నది. దీని అర్థం ఏమిటంటే ఈ సున్నత్’ను పాటిస్తున్నంత కాలం ఉమ్మహ్ (ముస్లిం జాతి) యొక్క వ్యవహారాలు క్రమబద్ధంగా ఉంటాయి మరియు వారు మంచి స్థితిలో (శుభాన్ని కలిగి) ఉంటారు. దానిని ఆలస్యం చేస్తే వారు అపమార్గం పట్టిపోతున్నారనడానికి అది సంకేతం.
  2. అన్నివేళలా, అన్ని సందర్భాలలో సున్నతుకు కట్టుబడి ఉండటం వల్ల ప్రజలలో శుభము, మంచితనం కొనసాగుతుంది, అయితే వ్యవహారాలలో చెడు చోటు చేసుకోవడం అనేది సున్నతు నుండి తప్పుకోవడం వల్ల, తప్పుదారి (అపమార్గం) పట్టడం వల్ల జరుగుంది.
  3. గ్రంథప్రజలు మరియు ‘బిదఅతీ’లు (ధర్మములో లేనిపోని విషయాలను ధర్మము పేరున కల్పించేవారు) ఉపవాస విరమణను ఆలస్యం చేస్తారు. ఈ విషయంలో వారిని వ్యతిరేకించాలి.
  4. ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథు దాని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తున్నది. ఇమాం అల్-ముహల్లబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దీని వెనుక ఉన్న హేతువు ఏమిటంటే, రాత్రి నుండి (కొంత భాగాన్ని తీసి) పగటిని పొడిగించకుండా ఉండడమే. నిజానికి అలా చేయడం (పగటిని పొడిగించకుండా, సమయానికి ఉపవాసాన్ని విరమించడం) ఉపవాసం ఉన్న వ్యక్తికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఆరాధనలను ఆచరించడానికి అతనికి ఎక్కువ బలాన్ని, శక్తిని అందిస్తుంది. ధర్మ పండితులందరి ఏకాభిప్రాయం ప్రకారం ‘ఉపవాసాన్ని విరమించడానికి తొందరపడం అనేది సూర్యాస్తమయాన్ని స్వయంగా దర్శించడం ద్వారా, లేక సూర్యాస్తమయం అయ్యిందని ఇద్దరు వ్యక్తుల సాక్ష్యముపై, లేదా సూర్యాస్తమయం అయ్యిందని ధర్మపరుడైన ఒక వ్యక్తి సాక్ష్యమిచ్చినా వర్తిస్తుంది. ఈ చివరి అభిప్రాయం (ధర్మపరుడైన ఒక వ్యక్తి సాక్ష్యమిచ్చినా వర్తిస్తుంది అనే అభిప్రాయం) ఎక్కువ మంది అంగీకరించే అభిప్రాయం.
  5. ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) అన్నారు: హెచ్చరిక: ఈ కాలంలో రమదాన్ నెలలో ఫజ్ర్ (ఉదయం) నమాజుకు సుమారు ఇరవై నిమిషాల ముందే మరో అదాన్ (నమాజు కొరకు పిలిచే ప్రకటన) ఇవ్వడం, మరియు ఉపవాసం ఉండాలనుకునేవారికి తినడం-త్రాగడం నిషేధించబడిందని సూచించడానికి వెలిగించిన దీపాలను ఆపివేయడం వంటి వాటిని కొందరు కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది నింద్యమైన బిద్అత్ (ఇస్లాంలో కొత్తగా చేర్చబడిన పద్ధతి). దీన్ని ప్రవేశపెట్టినవారు దీన్ని "ఆరాధనలో జాగ్రత్త"గా చేస్తున్నామని భావించారు, కానీ ఈ పద్ధతి (బిదఅత్ పద్ధతి అని) సాధారణ ప్రజలకు తెలియదు. ఇంకా, వారు సూర్యాస్తమయం తర్వాత కొంత సమయం ఆగి అదాన్ ఇవ్వడం మొదలుపెట్టారు, తాము సమయాన్ని నిర్ణయిస్తున్నామని భావించారు. ఫలితంగా, వారు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) సమయాన్ని పొడిగించారు, సహ్రీ (ఉపవాసానికి ముందు భోజనం)ని ముందుకు తెచ్చారు, అలా వారు సున్నతుకు (ప్రవక్త ﷺ యొక్క మార్గంకు) విరుద్ధంగా ప్రవర్తించారు. ఫలితంగా, వారిలో మంచి తగ్గింది, చెడు పెరిగింది. అల్లాహ్ మాత్రమే మనకు సహాయం చేసేవాడు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Урумӣ Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి