عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ:
كُنَّا نُخْرِجُ إِذْ كَانَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ زَكَاةَ الْفِطْرِ، عَنْ كُلِّ صَغِيرٍ وَكَبِيرٍ، حُرٍّ أَوْ مَمْلُوكٍ، صَاعًا مِنْ طَعَامٍ، أَوْ صَاعًا مِنْ أَقِطٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، أَوْ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ زَبِيبٍ، فَلَمْ نَزَلْ نُخْرِجُهُ حَتَّى قَدِمَ عَلَيْنَا مُعَاوِيَةُ بْنُ أَبِي سُفْيَانَ رضي الله عنه حَاجًّا، أَوْ مُعْتَمِرًا فَكَلَّمَ النَّاسَ عَلَى الْمِنْبَرِ، فَكَانَ فِيمَا كَلَّمَ بِهِ النَّاسَ أَنْ قَالَ: إِنِّي أَرَى أَنَّ مُدَّيْنِ مِنْ سَمْرَاءِ الشَّامِ، تَعْدِلُ صَاعًا مِنْ تَمْرٍ، فَأَخَذَ النَّاسُ بِذَلِكَ، قَالَ أَبُو سَعِيدٍ: فَأَمَّا أَنَا فَلَا أَزَالُ أُخْرِجُهُ كَمَا كُنْتُ أُخْرِجُهُ، أَبَدًا مَا عِشْتُ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 985]
المزيــد ...
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
“రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం. ముఆవియా ఇబ్న్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హుమా) హజ్జ్ నుండో ఉమ్రా నుండో తిరిగి వచ్చేంత వరకు మేము జకాతుల్ ఫిత్ర్ ఈ విధంగా తీయడం ఆపలేదు (అంటే ఈ విధంగానే జకాతుల్ ఫిత్ర్ ఇస్తూ వచ్చాము). ఆయన మెంబర్ పైకి ఎక్కి ప్రజలను సంబోధించి ఇలా అన్నారు: “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను”. ప్రజలు దానిని అంగీకరించారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (ర) ఇంకా ఇలా అన్నారు: “కానీ నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం ఆ విధంగానే జకాతుల్ ఫిత్ర్ తీస్తాను, ఏ విధంగానైతే నేను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలం నుండి) ఇప్పటి వరకూ తీస్తూ వచ్చినానో.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 985]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలములోనూ మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత వచ్చిన ఖులఫా-ఎ-రాషిదీన్’ల కాలములోనూ ముస్లిములు, ప్రతి చిన్నవారి తరఫు నుండి (ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ప్రతి ఒక్కరి తరఫు నుండి), ప్రతి పెద్దవారి తరఫు నుండి (స్త్రీ పురుషులలో ప్రతి ఒక్కరి తరఫు నుండి) ఒక ‘సా’ ఆహార దాన్యాన్ని జకాతుల్ ఫిత్ర్’గా చెల్లించేవారు. బార్లీ, ఎండిన ద్రాక్ష (ఎండుద్రాక్ష), వెన్న (అఖ్త్), మరియు ఖర్జూరాలు ఆ ప్రజల ప్రధాన ఆహారంగా ఉండేవి. నాలుగు ‘ముద్’లు ఒక ‘సా’ కు సమానము. ఒక ఎదిగిన వ్యక్తి దోసిలి నిండా పట్టినంత పరిమాణాన్ని ఒక ‘ముద్’ అంటారు. (‘సా’ మరియు ‘ముద్’ అనేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ధాన్యము మొదలైన వాటిని కొలవడానికి అమలులో ఉన్న కొలమానాలు) ముఆవియా (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా మదీనాకు వచ్చినపుడు సిరియాలో గోధుమలు విరివిగా వాడుకలో ఉండేవి. ప్రజలను సంబోధిస్తూ ఇచ్చిన ప్రసంగములో ఆయన “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు, ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను” అన్నారు. ప్రజలు దానిని అంగీకరించి దానిపైనే అమలు చేయడం ప్రారంభించినారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఏ విధంగా జకాతుల్ ఫిత్ర్ చెల్లిస్తూ వచ్చానో, అదే విధంగా చెల్లిస్తాను.”